మీ సెక్స్ లైఫ్ ఆనందంగానే ఉందా..?

First Published Sep 8, 2022, 11:55 AM IST

అందుకే.. కచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ దంపతులతో లైంగిక అవసరాలు, కోరికలను పంచుకోవాలట. ఈ క్రమంలో కొందరు.. తమ మనసులో వేరే భావన ఉన్నా,... తమ పార్ట్ నర్ కి అనుకూలంగా మారిపోతున్నారట.

దంపతుల మధ్య బంధం బలంగా, ఆనందంగా ఉండాలి అంటే... కచ్చితంగా వారి సెక్స్ లైఫ్ సజావుగా సాగాలి అని నిపుణులు చెబుతున్నారు. శృంగారం దాంపత్య జీవితంలో చాలా ముఖ్యమైన భాగం. అందుకే.. కచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ దంపతులతో లైంగిక అవసరాలు, కోరికలను పంచుకోవాలట. చాలా మంది తమ పార్ట్ నర్ తో లైంగిక అనుకూలత లేక ఇబ్బంది పడుతున్నారట. అదెలా తెలుసుకోవడం..? దానికి కారణాలు ఏంటో ఓ సారి చూద్దాం...
 

దాంపత్య జీవితంలో శృంగారం చాలా కీలకం అని భావించేవారు కొందరు ఉంటే... అది ఒక పార్ట్ మాత్రమే... అదే లైఫ్ కాదు అని భావించేవారు కొందరు ఉంటారు. అయితే... సెక్స్ ని కేవలం పిల్లలు కనడానికి మాత్రమే పనికి వచ్చేదానిగా మీ భాగస్వామి భావిస్తున్నారంటే.. వారికి సెక్స్ పట్ల పెద్దగా ఆసక్తి లేదని అర్థం. ఇలాంటి దంపతుల మధ్య లైంగిక అనుకూలత లేనట్లే లెక్క.
 

relationship tips

ఇక ఈ మధ్య సినిమాల్లో, వెబ్ సిరీస్ లో శృంగార సంబంధిత సన్నివేశాలు రావడం ఎక్కువయ్యాయి. మీరు మీ భాగస్వామితో కలిసి టీవీ చూస్తున్నప్పుడు అలాంటి సన్నివేశం వస్తే.. మీరు ఒకరిని చూసి మరొకరు ఇబ్బంది పడకూడదు. అలా కాకుండా.. ఇబ్బందితో తలలు తిప్పుతున్నారు అంటే.. మీ ఇద్దరి మధ్య లైంగిక అనుకూలత లేదని అర్థమట.

ఇక.. దంపతులు త్వరగా పనులు ముగించుకొని బెడ్రూమ్ కి వెళితేనే కదా ఇద్దరూ ఏకాంతంగా గడిపేది. అయితే.. మీరు తొందరగా గదిలోకి వెళ్లి ఎదురు చూస్తున్నా... మీ భాగస్వామి గదిలోకి రాకుండా.. పని ఉందని తరచూ సాకులు చెబుతున్నారు అంటే.. వారికి మీతో సెక్స్ చేయడం ఇష్టం లేకపోవచ్చు. దానికి ఇతర సాకులు వెతుకుతున్నారని అర్థం కావచ్చు.
 


మీరు లేదా మీ భాగస్వామి మీ లైంగిక కల్పనలను ఒకరికొకరు దాచిపెట్టినప్పుడు లేదా మీ టర్న్-ఆన్ లేదా టర్న్-ఆఫ్‌లు ఏమిటో ఒకరికొకరు చెప్పకుండా ఉన్నప్పుడు, మీ ఇద్దరి మధ్య భారీ లైంగిక అసమానత నిండి ఉందని అర్థం. సంబంధంలో ఉన్నప్పుడు, మీరిద్దరూ మీ లైంగిక ప్రాధాన్యతలన్నింటినీ ఒకరితో ఒకరు చర్చించుకోవాలి. వాటిని దాచకూడదు.
 

మీ భాగస్వామి సెక్స్ ఫాంటసీలు మిమ్మల్ని చికాకుపెడితే లేదా అసహ్యం కలిగిస్తే, భవిష్యత్తులో కూడా మీరు దాని గురించి చేదుగా భావించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ లైంగిక అననుకూలత చాలా తక్కువగా ఉందని అర్థం. వారి కోరిక మీకు ఇబ్బందిగా ఉంటే అది వారితో మాట్లాడి పరిష్కరించుకోవాలి. లేదంటే మీరే అర్థం చేసుకోవాలి. దాదాపు ఒకసారి అసహ్యం కలిగింది అంటే.. వాటిని అంగీకరించే అవకాశం చాలా తక్కువ అనే చెప్పాలి. 

మీరు మీ గత సంబంధాల గురించి, మీ మాజీతో మీరు కలిగి ఉన్న లైంగిక సంబంధం గురించి మీరు ఊహించినట్లయితే, మీరు మీ ప్రస్తుత భాగస్వామితో లైంగికంగా ఏమాత్రం అనుకూలంగా లేరని అర్థం.

click me!