Blouse designs: 40 ఏళ్లు దాటిన మహిళలు చీర మీదకు స్టైలిష్‌గా మాత్రమే కాదు డీసెంట్ గా ఉండే బ్లౌజ్ వేసుకోవాలి. బ్యాక్‌లెస్, డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకోవడం అంతగా కంఫర్ట్ గా ఉండదు. అలాంటి వారు ఈ షర్ట్ స్టైల్ బ్లౌజ్ డిజైన్లు ట్రై చేయడం మంచిది.
నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలు స్టైల్ కన్నా కంఫర్ట్ గా, డీసెంట్ గా ఉండే బ్లౌజ్‌లు వేసుకునేందుకు ఇష్టపడతారు. డీప్ నెక్ బ్లౌజ్ లు వేసుకోవడం వారికి ఇష్టం ఉండదు. ఇప్పుడు వారి కోసమే షర్ట్ స్టైల్ బ్లౌజ్‌లు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి బ్లౌజులపై చీర కడితే చాలా రాయల్, సోఫిస్టికేటెడ్ టచ్ ఇస్తాయి. కాటన్, షిఫాన్, జార్జెట్, సిల్క్, లినెన్.. ఇలా దాదాపు అన్ని రకాల చీరలతో వీటిని సులువుగా జత చేయొచ్చు. ఆఫీస్, పార్టీ, ఫ్యామిలీ ఫంక్షన్ లేదా క్యాజువల్ అవుటింగ్.. ఇలా సందర్భం ఏదైనా ఈ బ్లౌజులు అదిరిపోతాయి.
25
డెనిమ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
చీరతో పాటూ మీకు మోడ్రన్, ఫ్యూజన్ లుక్ కావాలనుకుంటే ఇలాంటి డెనిమ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. పూసలు, ఎంబ్రాయిడరీ, ఫ్లోరల్ వర్క్ ఉన్న డెనిమ్ బ్లౌజ్‌లను మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిని ప్లెయిన్, ప్రింటెడ్ లేదా హ్యాండ్లూమ్ చీరలపై కట్టుకుంటే అదిరిపోతాయి.
35
ఫుల్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
చేతులు పూర్తిగా కప్పి ఉంచేలా ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌లు ఎప్పుడూ కూడా క్లాసిక్లు లుక్‌ను ఇస్తాయి. మీరు పేస్టల్ లేదా తెలుపు రంగు చీరతో కాంట్రాస్ట్ కలర్ ఫుల్ స్లీవ్స్ షర్ట్ స్టైల్ బ్లౌజ్‌ను వేసుకుంటే అందరి కళ్లు మీమీదే. ఈ లుక్ 40 ఏళ్లు దాటిన మహిళలకు చాలా బాగా నప్పుతుంది.
ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు స్టాండ్ కాలర్ బ్లౌజ్ మంచి ఆప్షన్. ఈ డిజైన్ చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. నలుపు, నేవీ బ్లూ లేదా మెరూన్ వంటి ముదురు రంగులలో ఉన్నవి వేసుకుంటే ఆ బ్లౌజ్‌లు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి డీప్ నెక్‌గానీ, బ్యాక్‌లెస్‌గానీ ఉండవే. కాబట్టి సౌకర్యంగా ఉంటాయి.
55
ఓవర్‌సైజ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్
ఓవర్‌సైజ్ షర్ట్‌ల ట్రెండ్ ఇప్పుడు ఫ్యాషన్‌గా కనిపిస్తారు. ఈ బ్లౌజ్ ల వల్ల ఏ చీరకైనా మోడ్రన్, ఎస్తెటిక్ లుక్ దక్కుతుంది. ఫ్లోరల్ ప్రింట్ చీరతో ఇలా చెక్స్ ప్యాటర్న్ లేదా సాలిడ్ కలర్ ఓవర్‌సైజ్ షర్ట్ స్టైల్ బ్లౌజ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.