Fitness Tips: సన్నగా, ఫిట్‌గా, ఎనర్జీతో ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే అందుకోసం కఠినమైన డైట్ లు అవసరం లేదు. సరైన ఫుడ్ తీసుకుంటూ, లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఫిట్ గా ఉండొచ్చు. ఫిట్‌గా ఉండటానికి సహాయపడే 5 టిప్స్ మీకోసం..
సన్నగా కనిపించడం అంటే బరువు తగ్గడం మాత్రమే కాదు. శరీరం ఆరోగ్యంగా, సమతుల్యంగా ఉండటం కూడా. చాలామంది ఫాస్ట్ గా స్లిమ్ అవ్వాలని ప్రయత్నిస్తూ తప్పు డైట్‌లు, అనారోగ్యమైన పద్ధతులను పాటిస్తుంటారు. కానీ దీర్ఘకాలంలో మంచి ఫలితాలు రావాలంటే సరైన లైఫ్ స్టైల్, సమతుల్య ఆహారం, శరీరాన్ని అర్థం చేసుకునే విధానం అవసరం. అమ్మాయిలు ఆరోగ్యంగా సన్నగా, నాజుగ్గా ఉండడానికి సహాయపడే 5 ముఖ్యమైన టిప్స్ ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.
26
ఐరన్ లోపం లేకుండా చూసుకోవడం
చాలామంది అమ్మాయిల్లో ఐరన్ లోపం సాధారణంగా కనిపిస్తుంది. ఇది రక్తహీనతకు దారితీసి అలసట, బలహీనత, బరువు పెరగడం, తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో ఐరన్ సరిపడా లేకపోతే మెటబాలిజం కూడా ప్రభావితమవుతుంది. అందుకే పాలకూర, బీట్‌రూట్, ద్రాక్ష, ఖర్జూరం, పప్పులు వంటి ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి.
36
విపరీతమైన డైటింగ్ వద్దు
చాలామంది త్వరగా బరువు తగ్గాలని ఆహారం చాలా తగ్గిస్తారు. కానీ ఇది శరీరానికి హాని చేస్తుంది. విపరీతమైన డైటింగ్ వల్ల మెటబాలిజం స్లో అవుతుంది. శరీరం బలహీనపడుతుంది. తిరిగి బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే సమతుల్య ఆహారం తీసుకోవడం ఉత్తమ మార్గం. సరైన పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫ్యాట్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా సన్నగా ఉండవచ్చు.
అమ్మాయిల శరీరం హార్మోన్ల మార్పులకు అనుగుణంగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో ఎక్కువ ఒత్తిడి చేసే వ్యాయామాలు చేయకుండా, లైట్ వాకింగ్ లేదా స్ట్రెచింగ్ చేయడం మంచిది. పీరియడ్స్ తర్వాత రోజుల్లో శరీరం ఎక్కువ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా శరీరాన్ని అర్థం చేసుకుని వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు.
56
ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం
ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. కండరాలను బలోపేతం చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంచుతుంది. ఇది బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది. గుడ్లు, పాలు, పెరుగు, పన్నీర్, పప్పులు, చికెన్ వంటి ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. ప్రోటీన్ సరిపడా తీసుకోవడం వల్ల సన్నగా, ఫిట్‌గా కనిపిస్తారు.
66
స్ట్రెస్ తగ్గించుకోవడం
మానసిక ఒత్తిడి శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బరువు పెరగడం, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. యోగా, ధ్యానం, సంగీతం వినడం వంటి అలవాట్ల ద్వారా స్ట్రెస్‌ను తగ్గించుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.