పెదాలు నల్లగా మారుతున్నాయా? ఇలాచేస్తే.. ఎర్రగా మారుతయ్..

First Published Nov 12, 2022, 4:03 PM IST

కొందరి పెదాలు ఎర్రగా, గులాబి రంగులో ఉంటే మరికొందరివి నల్లగా ఉంటాయి. అయితే కాలాలు మారడంతో కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. మీ పెదాలు పింక్ కలర్ లోకి మారుతాయి. 
 

లిప్ స్టిక్ ఇష్టం లేని వారు అస్సలు ఉండరేమో. కొంతమంది అయితే లిప్ స్టిక్ ను పెట్టుకోనిదే.. ఇంటి బయటకు కూడా అడుగుపెట్టరు. మీకు తెలుసా.. లిప్ స్టిక్ ను ఎక్కువగా వాడటం వల్ల కూడా పెదాలు నల్లగా అవుతుంటాయి. అలాగే సూర్యరశ్మి, స్మోకింగ్ వల్ల కూడా పెదాలు నల్ల బడుతుంటాయి. కానీ పెదాలు నల్లగా అవ్వడం వల్ల ముఖం అందంగా కనిపించదు. ఇలాంటప్పుడు కొంతమంది ఎర్రని లిప్ స్టిక్ ను పెడుతుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లని పెదాలను ఎర్రగా, పింక్ కలర్ లోకి మార్చొచ్చు. అంతేకాదు ఈ పద్దతుల వల్ల మీ పెదాలు అందంగా, తేమగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గ్లిజరిన్

నల్లని పెదాలను ఎర్రగా మార్చడానికి పెదాలకు గ్లిజరిన్ ను ఉపయోగించొచ్చు. ఇది మీ పెదాలను తేమగా ఉంచుతుంది. అలాగే మృదువుగా చేస్తుంది. గ్లిజరిన్ కు మాయిశ్చరైజింగ్ గుణం ఉంటుంది. అంతేకాదు దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. దీనిని పెదాలకు రాయడం వల్ల పెదాల రంగు తొందరగా మారుతుంది. ఇందుకోసం ప్రతిరోజూ రాత్రి మీరు పడుకునే ముందు కాటన్ ను గ్లిజరిన్ లో మించి పెదాలను అప్లై చేయండి. ఇది మీ పెదాలను శుభ్రం కూడా చేస్తుంది. గ్లిజరిన్ నల్లని పెదాలున్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

బీట్ రూట్

ముదురు రంగు పెదాలను గులాబీ రంగులోకి మార్చడానికి బీట్ రూట్ గొప్పగా ఉపయోగపడుతుంది తెలుసా.. బీట్ రూట్ లో బెటలెన్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి మీ పెదాలను సహజంగా ఎర్రగా చేయడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడానికి ముందు బీట్ రూట్ ను కట్ చేసి ఫ్రిజ్ లో కాసేపు  పెట్టండి. ఇది చల్లగా అయిన తర్వాత ఒక ముక్కను తీసుకుని 5 నిమిషాల పాటు మీ పెదాలకు మసాజ్ చేయండి.
 

ఇలా కాకుండా  ఒక టీ స్పూన్ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుని అందులో అర టీస్పూన్ పంచదారను మిక్స్ చేయండి. దీన్ని చేతితో తీసుకుని పెదాలకు స్క్రబ్ చేయండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో మీ పెదాలను నీట్ గా కడగండి. దీనిని వారానికి రెండు సార్లు ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. 

తేనె, నిమ్మకాయ

నిమ్మకాయ, తేనె కూడా నల్లని పెదాలను ఎర్రగా చేయడానికి సహాయపడతాయి. నిమ్మకాయ, తేనె రెండింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. తేనెలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆలెర్జిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఉపయోగించడానికి ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి గంట పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. అయితే ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో ఉంచి రోజుకు రెండు సార్లు వాడండి.. 
 

click me!