
మన దేశంలో వివిధ ప్రాంతాల్లో బంకమట్టితో తయారుచేసిన టీ కప్పులు లభిస్తాయి. టీ ని మట్టి కప్పులో తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీకు తెలుసా.. మట్టి కప్పుల్లో టీ తాగితే.. చాలా రుచిగా ఉంటుందట. ఉత్తర భారతదేశంలో మట్టి కప్పులలో టీ తాగడాన్ని 'కుల్హాద్' అని పిలుస్తారు. పురాతన కాలంలో.. ప్రజలు సిరామిక్స్, గాజు పాత్రల కంటే మట్టి పాత్రల్లోనే ఫుడ్ వండుకుని.. మట్టిపాత్రల్లోనే పెట్టుకుని తినేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ అలవాటు పూర్తిగా మారిపోయింది. అయితే మట్టి కప్పుల్లో టీ తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం చాలా హోటళ్లు ఈ పద్దతిని ఫాలో అవుతున్నాయి. మట్టి కప్పుల్లో టీ ఇవ్వడాన్ని. ఈ టీలు రుచిలోనే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయిని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మట్టి కప్పులో టీ తాగడం వల్ల ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కప్పుల్లో టీ చాలా పరిశుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే సిరామిక్ పాత్రలను పదే పదే వాడుతూ కడిగి మళ్లీ వాడుతుంటారు. అదే మట్టి గ్లాసును అయితే ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగిస్తాయి. ఆ తర్వాత దీన్ని మళ్లీ కరిగించి మట్టి కప్పును తయారు చేసుకోవచ్చు. ఈ మట్టికప్పు శరీరానికి ఎటువంటి హాని కలిగించదు. దీని వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. కాబట్టి అందుబాటులో ఉండే మట్టి గ్లాస్ లో టీ తాగడం మర్చిపోకండి.
ఎసిడిటీని తొలగిస్తుంది
సాధారణంగా మట్టి కప్పులల్లో సహజ ఆల్కేన్ ఉంటుంది. ఇది టీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఏర్పడకుండా నిరోధిస్తుంది. చాలా మంది ప్రజలు టీ తాగిన వెంటనే ఎసిడిటీని సమస్య ను ఫేస్ చేస్తుంటారు. కానీ మట్టి గ్లాసులో టీ తాగితే పుల్లని త్రేన్పులు, ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశమే ఉండదు.
సంక్రామ్యత నుంచి కాపాడుతుంది
మీరు వీధుల్లో, రోడ్ సైడ్ టీ స్టాల్ వద్ద టీని ఎక్కువగా ప్లాస్టిక్ గ్లాస్ లల్లోనే సర్వ్ చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. ప్లాస్టిక్ కప్పులల్లో ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. అలాగే గాజు పాత్రలను సరిగ్గా శుభ్రం చేయరు. వీటివల్ల సంక్రమణ అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా జరగకూడదంటే టీని మట్టి కప్పుల్లోనే తాగండి.
పేపర్ కప్పులని నమ్మకూడదు
ప్లాస్టిక్ కప్పులకు బదులుగా.. కాగితంతో తయారు చేసిన కప్పులను మార్కెట్లలో విక్రయిస్తున్నారు. దీన్నే స్టైరోఫోమ్ అంటారు. వాస్తవానికి ఇవి కాగితంతో తయారు చేయబడవు. దీనిని తయారు చేయడానికి పాలీస్టైరిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారు.వీటిల్లో టీ లేదా మరేదైనా రసాన్ని తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే ఈ కప్పులో ఏదైనా తింటే హార్మోన్ల రుగ్మతలు, ఏకాగ్రత లోపించడం, జలుబు సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. టీని మట్టి గ్లాస్ లో తాగడం వల్ల ఇలాంటి సమస్యలేమీ రావు.
చిన్న వ్యాపారాలు పెరుగుతాయి
మట్టి కుండలను, పాత్రలను ఎక్కువ మటుకు గ్రామీణ ప్రాంతాల్లోనే తయారుచేస్తారు. ముఖ్యంగా కొన్ని కుటుంబాలకు వీటి తయారే జీవనాధారం. వీటి ఆదాయంపైనే ఇంటిళ్లిపాది ఆధారపడి బతుకుతారు. కాబట్టి మట్టి కప్పుల్లో టీ తాగడం వల్ల వారి జీవితాలు మెరుగుపడతాయి. ఉపాది పెరుగుతుంది. మట్టికప్పుల్లో తాగడం వల్ల వీటిపై ఆధారపడి బతుకున్న వాళ్ల బతుకు చక్రం మెరుగ్గా ఉంటుంది. అందుకే వీటిని ప్రోత్సహించండి.