సబ్బును ఉపయోగించే సరైన విధానం
శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బు చాలా అవసరం. అయితే ఎక్కువ సబ్బు రుద్దేయడం కూడా మంచిది కాదు. సబ్బు ఎక్కువ పెట్టి రుద్దితే చర్మం పొడిబారిపోతుంది.
మొదట మొహం రుద్దుకొని నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత చేతులు, మెడ, భుజాలు, అరచేతులు, ఛాతీ, వీపు రుద్దుకోవాలి. తర్వాత నీటితో మొహం పైనుంచి నీరు పోస్తూ సబ్బు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చివరిగా కాళ్లు, పాదాలు, వేళ్లు, గోర్లు సబ్బుతో రుద్దు కోవాలి. తర్వాత కూడా మొహం పైనుంచి నీరు పోసుకుంటూ కాళ్లపై ఉన్న సబ్బు మొత్తం పోయేలా రుద్దు కోవాలి.