Sarees: తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరకు చీరలు దొరికే బెస్ట్ ప్లేసులు ఇవే!

Published : Nov 18, 2026, 04:33 PM IST

Sarees: చీరలంటే ఇష్టపడని మహిళలు ఉండరు. పండగైనా, ఫంక్షన్ అయినా ముందుగా గుర్తొచ్చేది చీరలే. అయితే అందమైన చీర కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సిన పనిలేదు. తక్కువ ధరలోనూ మంచి చీరలు కొనొచ్చు. మరి చీరల షాపింగ్‌కు తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్లేసులు ఏవో తెలుసా?

PREV
15
చీరల షాపింగ్ కి బెస్ట్ మార్కెట్లు

పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఫంక్షన్లు.. ఇలా సందర్భం ఏదైనా చీర కట్టుకుంటే వచ్చే అందమే వేరు. అయితే అందమైన చీర కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్‌లోనే మంచి డిజైన్లు, ఆకర్షణీయమైన రంగులు, నాణ్యమైన ఫ్యాబ్రిక్‌తో ఉన్న చీరలు దొరికే ఎన్నో ప్రాంతాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.

ముఖ్యంగా కొన్ని పట్టణాలు చేనేత చీరలకు, మరికొన్ని మార్కెట్లు తక్కువ ధరల ఫ్యాషన్ చీరలకు ప్రసిద్ధి చెందాయి. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు సరైన ప్రాంతాన్ని ఎంచుకుంటే మీ బడ్జెట్‌లోనే నచ్చిన చీరను సొంతం చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో తక్కువ ధరలకు చీరలు దొరికే బెస్ట్ ప్లేసులు ఏవో తెలుసుకుందాం.

25
తెలంగాణలో చీరల షాపింగ్‌కు బెస్ట్ ప్లేసులు

మదీనా మార్కెట్, హైదరాబాద్

హైదరాబాద్‌లో తక్కువ ధరలకు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ కొనాలనుకునేవారికి మదీనా మార్కెట్ మంచి ఎంపిక. ఇక్కడ డైలీవేర్ చీరలు 120 రూపాయల నుంచి కూడా ఉంటాయి. ఫ్యాన్సీ, పట్టు చీరల ధరలు వాటి నాణ్యత, రకాలను బట్టి నిర్ణయిస్తారు. డైలీవేర్ కి అనువైన కాటన్ చీరల నుంచి ఫంక్షన్లకు ధరించే ఫ్యాన్సీ డిజైన్ల వరకు వివిధ రకాల కలెక్షన్లు ఇక్కడ దొరుకుతాయి.

బేగంబజార్, హైదరాబాద్

హోల్‌సేల్, రిటైల్ షాపింగ్‌కు పేరుగాంచిన బేగంబజార్‌లోనూ చీరలు, ఇతర దుస్తులు కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కొన్ని దుకాణాల్లో తక్కువ ధరలకు చీరలు, డ్రెస్ మెటీరియల్స్ లభిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, కుటుంబ వేడుకల కోసం ఒకేసారి ఎక్కువ సంఖ్యలో చీరలు కొనాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్లేస్.

35
జనరల్ బజార్, సికింద్రాబాద్

సిల్క్, కాటన్, చేనేత చీరలకు సికింద్రాబాద్ లోని జనరల్ బజార్ ప్రసిద్ధి. సింగిల్ పీస్ లేదా కొన్ని చీరలు విడిగా కొనాలి అనుకునేవారికి ఈ మార్కెట్ మంచి ఎంపిక.

భూదాన్ పోచంపల్లి

చేనేత చీరలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాల్లో పోచంపల్లి ఒకటి. ఇక్కడ తయారయ్యే ఇక్కత్ చీరలు ప్రత్యేకమైన డిజైన్లు, రంగుల కలయికతో ఆకట్టుకుంటాయి. కాటన్, సిల్క్, సిల్క్-కాటన్ మిశ్రమ వస్త్రాలతో తయారయ్యే చీరలు అందుబాటులో ఉంటాయి.

45
ఆంధ్రప్రదేశ్‌లో చీరల షాపింగ్‌కు బెస్ట్ ప్లేసులు

చీరాల

చీరాల వస్త్రాలకు, చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి. ఇక్కడ కాటన్, సిల్క్ చీరలతో పాటు వివిధ రకాల డిజైన్లు లభిస్తాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి కాటన్ చీరలు కొనాలనుకునేవారు ఇది బెస్ట్ ప్లేస్. చీరాల పరిసరాల్లోని నేత కార్మికులు, దుకాణాల్లో విభిన్నమైన కలెక్షన్లు అందుబాటులో ఉంటాయి.

వెంకటగిరి

అందమైన జరీ అంచులు, సున్నితమైన డిజైన్లతో ప్రసిద్ధి చెందిన చీరలు కావాలంటే వెంకటగిరి మంచి ప్రాంతం. ఇక్కడి చీరలకు ప్రత్యేకమైన చేనేత గుర్తింపు ఉంది. కాటన్, సిల్క్ రకాలలో చీరలు లభిస్తాయి. తక్కువ బరువులో అందంగా కనిపించే చీరలు కావాలనుకునేవారికి ఇవి బాగా నచ్చుతాయి.

55
ఉప్పాడ

ప్రత్యేకమైన జామ్‌దాని చీరలు కొనాలనుకునేవారికి కాకినాడ సమీపంలోని ఉప్పాడ మంచి ఎంపిక. ఇక్కడి చీరలు వాటి సున్నితమైన నేతపని, అందమైన డిజైన్లతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. పట్టు, జరీతో కూడిన చీరలు వివాహాలు, ప్రత్యేక వేడుకలకు చక్కగా సరిపోతాయి. బడ్జెట్‌ను బట్టి నచ్చిన చీరలను కొనుగోలు చేయవచ్చు.

మంగళగిరి

మంగళగిరి చేనేత చీరలు, కాటన్ వస్త్రాలకు ఎంతో ప్రసిద్ధి. సింపుల్‌గా, సంప్రదాయంగా కనిపించే చీరలు ఇష్టపడేవారికి మంగళగిరి మంచి ఎంపిక. ముఖ్యంగా డైలీవేర్ కి, ఆఫీస్‌కు, చిన్న చిన్న ఫంక్షన్లకు కట్టుకోవడానికి అనువైన డిజైన్లు ఇక్కడ దొరుకుతాయి. మంగళగిరిలో చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories