కంటి ఆరోగ్యానికి బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

First Published Sep 24, 2022, 10:47 AM IST

చేపలు, బచ్చలి కూర, గుడ్లు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలు కంటిచూపును మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిలో కళ్లను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటిని మీ డైట్ లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. 
 

కళ్లు లేని  జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. మన కళ్లు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వారకు ఎంతో కష్టపతాయి. దీనివల్ల కళ్లు బాగా అలసిపోతాయి. అందుకే కళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.  లేకపోతే కంటిచూపును కోల్పోవచ్చు. కాబట్టి కంటిని ఆరోగ్యంగా ఉంచే పోషకాహాన్ని ఎక్కువగా తీసుకోండి. మరి కంటిచూపును మెరుగ్గా ఉంచే ఆహారాలేంటో తెలసుకుందాం పదండి. 

చేపలు

చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపను మెరుగుపరుస్తాయి. ఇందుకోసం సాల్మన్ చేపలను తరచుగా తింటూ ఉండండి. ఈ చేపలను తినడం వల్ల కంటిచూపు మెరుగుపడటమే కాదు.. ఆరోగ్యం కూడా బాగుంటుంది.

వేరుశెనగ

వేరుశెనగల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తిని కూడా  పెంచుతుంది. ఈ గింజలను తినడం వల్ల బ్రెయిన్ కు రక్తప్రసరణ కూడా మెరుగ్గా జరుగుతుంది. 
 

బచ్చలికూర

బచ్చలికూరలో బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాగే దీనిలో కంటి చూపును మెరుగుపరిచే విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ల్యూటిన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ కూరను తినడం శరీరంలో ఐరన్ లోపం కూడా పోతుంది. 

పొద్దుతిరుగుడు విత్తనాలు

కంటిచూపున మెరుగుపర్చడానికి అవసరమయ్యే విటమిన్ ఇ ఈ పొద్దుతిరుగుడు గింజల్లో పుష్కలంగా ఉంటుంది. ఈ గింజలు రాత్రి అంధత్వాన్ని కూడా నివారిస్తాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు ఆస్తమా, కీళ్ల నొప్పులను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. 

బాదం

బాదం పప్పులో కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్లతో పాటుగా విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉంటుంది. అవి రెటీనాను రక్షిస్తాయి. అంతేకాదు ఫ్రీరాడికల్స్ నుంచి కంటిని కాపాడుతాయి. అందుకే ప్రతిరోజూ గుప్పెడు బాదం గింజలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
 

బ్రోకలీ

బ్రోకలీలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ కూరగాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సి కంటిలోని Aqueous humour మెరుగుపరుస్తుంది. అంతేకాదు దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మలబద్దకం సమస్యను కూడా పోగొడుతాయి. 
 

క్యారెట్

బచ్చలికూర మాదిరిగానే.. క్యారెట్‌లో కూడా బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ బీటా కెరోటిన్ కంటిచూపును మెరుగుపరుస్తాయి. అంతేకాదు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్లను కాపాడుతాయి కూడా. అలాగని వీటిని ఎక్కువగా తినకూడదు. మోతాదులోనే తినాలి. లేదంటే చర్మ రంగు మారుతుంది. 
 

గుడ్లు

గుడ్లలో రెటీనాకు ఉపయోగపడే లుటీన్, జియాక్సంతిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది  రాత్రి అంధత్వాన్ని, కళ్లు డ్రై గా మారడాన్ని తగ్గిస్తుంది. గుడ్లు కంటి ఆరోగ్యానికే కాదు.. శరీరం మొత్తాన్ని కాపాడుతుంది. ఎందుకంటే దీనిలో ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

click me!