వీటిని బ్రేక్ ఫాస్ట్ లో తింటే అజీర్థి అనే సమస్యే ఉండదు..

First Published Sep 23, 2022, 5:00 PM IST

అజీర్థి, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో నేడు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వీటికి మూల కారణం మీరు తినే అనారోగ్యకరమైన  ఆహారమే. 
 

దాదాపుగా మన ఆరోగ్యం మనం తినే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. మంచివి తింటే ఎలాంటి సమస్యలు రావు. లేదంటేనే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది చిన్నవయసులోనే  ఎన్నో ప్రమాదకరమైన సమస్యలతో బాధపడుతున్నారు. అందులో డయాబెటిస్, ఒత్తిడి, హైపర్ టెన్షన్, కిడ్నీ వ్యాధులు ఉన్నాయి. ఈ వ్యాధులు సోకితే.. మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ వ్యాధులన్నీ మీ మరణానికి దారితీస్తాయి. ఇకపోతే ఈ సమస్యలతో పాటుగా జీర్ణ సమస్యలను కూడా ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నారు. అజీర్థి, పొత్తికడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలను ఎదుర్కొనే వారు చాలా మందే ఉన్నారు. నిజానికి ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే. శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి హెల్తీ ఫుడ్స్ నే తినాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తింటే శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా అజీర్థి సమస్య కూడా పోతుంది. అవేంటంటే..
 

papaya

బొప్పాయి

ప్రతిరోజూ ఉదయం పూట బొప్పాయిని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఈ పండులో విటమిన్ కె, విటమిన్ డి, పొటాషియం, మెగ్నీషియం వంటి వివిధ పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. దీన్ని ప్రతిరోజూ కొంత మొత్తంలో తిన్నా ఎలాంటి దుష్ఫ్రభావాలు ఉండవు. 
 

ఆపిల్స్

బ్రేక్ ఫాస్ట్ లో ఆపిల్స్ ను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.  ఈ పండు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండును తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు బరువు తగ్గడం కూడా ఈజీ అవుతుంది. ఆపిల్స్ తో స్మూతీని తయారు చేసి కూడా తినవచ్చు. రోజూ ఒక ఆపిల్ పండును తింటే ఎన్నో రోగాలు దూరమవుతాయి.
 

కీరదోసకాయ

కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ప్రతిరోజూ దీన్ని ఉదయం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కీరదోసకాయ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా జీర్ణక్రియను మెరుగుపరచడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కీరదోస కాయ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. వడదెబ్బ కొట్టే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

అరటిపండ్లు

బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండ్లను కూడా తినొచ్చు. ఈ పండులో  ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేకాదు ఎన్నో  ప్రయోజనకరమైన పదార్థాలు కూడా ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు జీర్ణక్రియను మెరుగుపరచడంలో అరటిపండ్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి మీరు రోజూ బ్రేక్ ఫాస్ట్ లో అరటి స్మూతిని తీసుకోండి. 

lemon

తేనె, నిమ్మకాయ డిటాక్స్ నీరు

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ,  తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం తాగితే మంచి ఫలితాలుంటాయి. ఇది మీ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఈ పానీయం మీ శరీరంలోని అన్ని కలుషిత పదార్థాలను తొలగిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. ఫలితంగా మీరు వేగంగా బరువు తగ్గుతారు. 

click me!