గర్భిణీ సమయంలో కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు.. గర్భవతులు ఎదుర్కొన్నే కొన్ని సమస్యలనుంచి కూడా బయటపడొచ్చు. pregnancy సమయంలో వచ్చే నడుం నొప్పి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడిల నుంచి బయటపడొచ్చు.
గర్భిణీ సమయంలో శరీరం చురుకుగా ఉండాలి. దీనికోసం తగిన వ్యాయామం అవసరం. చాలామంది pregnancy కన్ ఫర్మ్ కాగానే జాగ్రత్త పడిపోతారు. ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. కాస్త కూడా ఏ పనీ చేయరు. అయితే ఇది సరికాదు అని వైద్యులు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.
210
కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలన్నా...డెలివరీ ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా జరగాలన్నా ఖచ్చితంగా శరీరానికి వ్యాయామం ఉండాలి. కొన్ని రకాల వ్యాయామాలు మీకు, మీ కడుపులోని బిడ్డకు శ్రీరామరక్షగా మారతాయి. వీటివల్ల preterm, సిజేరియన్ ఆపరేషన్ల భారినుంచి తప్పించుకోవచ్చు.
310
గర్భిణీ సమయంలో కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు.. గర్భవతులు ఎదుర్కొన్నే కొన్ని సమస్యలనుంచి కూడా బయటపడొచ్చు. pregnancy సమయంలో వచ్చే నడుం నొప్పి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడిల నుంచి బయటపడొచ్చు.
410
Pregnancy
గర్భిణీ సమయంలో exercise మంచిదే.. కాకపోతే మరీ విపరీతంగా చేయడం మంచిది కాదు. ఎక్కువ సేపు హార్డ్ వ్యాయామాలు ఇబ్బందిని కలిగిస్తాయి. స్ట్రెచ్ లు, పదే పదే వంగి లేవడాలు ఇలాంటివి చికాకు పెడతాయి. మరోవైపు కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదమా అనే సందేహాలనూ కలిగిస్తాయి. అందుకే ఎలాంటి వ్యాయామాలు మంచివి, ఏవి చేయాలి? ఏవి చేయకూడదు అనేది తెలిసి ఉండాలి.
510
pregnancy
వాకింగ్ : brisk walking వల్ల మీ గుండె ఆరోగ్యంగా పదిలంగా ఉంటుంది. అంతేకాదు వాకింగ్ వల్ల మీ కీళ్లు, కండరాలు ఒత్తిడికి గురి కాకుండా రిలాక్స్ అవుతాయి. బిగినర్స్ కి ఇది చాలా మంచిది. మీ మూడ్ ను కూడా సరి చేస్తుంది.
610
low-impact aerobics : లూంజ్‌లు, స్క్వాట్‌లు వంటి తక్కువ-ప్రభావ బాడీవెయిట్ వర్కౌట్‌లు చేయడం వల్ల మీ దినచర్యను ప్రభావవంతం చేస్తుంది. ఈ వ్యాయామాలు మీకు తేలికగా ఉండి... అదనపు ఉత్సామాన్ని ఇస్తాయి. అయితే ఇలాంటి వ్యాయామాలను ఎన్నుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
710
pregnant
ఈత : నీరు మీ పొట్ట బరువును తగ్గించి వ్యాయామాన్ని సులువు చేస్తుంది. అందుకే గర్బిణీలకు అత్యంత చక్కటి ఎక్సర్ సైజ్ swimming. ఈత వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గుండె కొట్టుకునే వేగాన్ని క్రమబద్దీకరిస్తుంది.
810
ప్రెగ్నెన్సీ సమయంలో లైట్ వెయిట్స్ ఎత్తొచ్చు. మరీ ఎక్కువ బరువులు కాకుండా తేలికైన బరువులు ఎత్తడం వల్ల చక్కటి వ్యాయామం జరుగుతుంది. ఇలాంటి స్ట్రెంథ్ ట్రైనింగ్ వ్యాయామాల వల్ల కండరాలు బలపడతాయి. ఎముకలను దృఢంగా మార్చేస్తాయి.
910
యోగా, పైలెట్స్ : yoga, pilates లాంటి ఎక్సర్ సైజులు లో ఇంపాక్ట్ వ్యాయామాలు. అందుకే ఇలాంటివి గర్భిణీ సమయంలో ఎలాంటి భయం లేకుండా చేయచ్చు. యోగా లో కూడా మరీ హార్డ్ గా ఉండే ఆసనాలు కాకుండా, ప్రాణాయామంతో పాటు తేలికగా ఉండే వ్యాయామాలు చేయడం మంచిది.
1010
గర్భిణీ సమయంలో నార్మల్ బైక్స్ నడపడం కంటే.. స్టేషనరీ బైక్స్ నడపడం చాలా మంచిది. stationary bikes తొక్కడం వల్ల మీ కొవ్వును కరిగించడమే కాకుండా.. మీ ఎముకల్ని బలంగా తయారుచేస్తుంది.