ఈ చిట్కాలతో అవాంఛిత రోమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి!

First Published Oct 28, 2021, 2:40 PM IST

అమ్మాయిలలో అవాంఛితరోమాలు  (unwanted hairs) అంతులేని వేదనకు గురి చేస్తాయి. ఈ అవాంఛిత రోమాలు రావుటకు కారణం వారిలోని హార్మోన్ల సమస్యలు. కాబట్టి వీటిని తొలగించడానికి ఆర్టిఫిషల్ క్రీములను (Artificial creams) వాడకుండా సహజసిద్ధమైన పద్ధతిలో ఎలా తొలగించుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 
 

అమ్మాయిల ముఖం, కాళ్లు, చేతులపై విపరీతంగా అవాంఛితరోమాలు వచ్చి వారిని ఇబ్బంది కలిగిస్తాయి. వీటిని తొలగించుకోవడానికి త్రెడ్డింగ్, షేవింగ్, లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. వీటి ద్వారా చర్మ సమస్యలు (Skin problems) వస్తుంటాయి. వీటిని సులభంగా ఇంటి చిట్కాలతో (Home remedy) తొలగించుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 

రెండు టీ స్పూన్ల శెనగపిండికి కొంచెం పసుపు, పాలు (Milk) కలుపుకొని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలు ఉన్న ప్రదేశంలో పూయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అవాంఛిత రోమాల సమస్య తగ్గుతుంది.  
 

ఒక గ్లాసు వాటర్ (Water) ను తీసుకుని ఇందులో సగం కప్పు చక్కెర (Sugar) వేసి స్టౌ మీద ఉంచి బాగా మరిగించాలి. ఇది పాకంలాగా మారాక స్టవ్ ఆఫ్ చేయాలి.ఈ పాకంలో రెండు స్పూన్లు నిమ్మరసం (Lemon juice) కలపాలి. ఈ మిశ్రమాన్ని అవాంచితరోమాలు ఉన్న ప్రదేశంలో మర్దన చేయాలి. అరగంట తరువాత చల్లటి నీటితో శుభ్రపరచాలి. దీని ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
 

ముఖంపై ఉండే రోమాలను తొలగించుకోవడానికి కొంచెం పసుపు (Turmeric) తీసుకొని అందులో రెండు స్పూన్ ల శెనగపిండి (Besan), ఒక స్పూన్ వేపాకు పొడి (Neem powder), కొంచెం పచ్చిపాలు (Milk) వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై నెమ్మదిగా మర్దన చేయాలి. పావుగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛితరోమాలు పెరుగవు.
 

రెండు స్పూన్ ల పచ్చి బొప్పాయి గుజ్జు (Papaya pulp), ఒక స్పూన్ కలబంద గుజ్జు (Alovera), ఒక స్పూన్ శెనగపిండి (Besan), కొంచెం పసుపు (Turmeric) కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని అవాంఛితరోమాలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం అవాంఛిత రోమాల సమస్యను శాశ్వతంగా తొలగిస్తుంది.

click me!