Summer Colors: ఎండలో బయటకు వెళ్తున్నారా? ఈ రంగుల దుస్తులే బెస్ట్ ఛాయిస్

Published : May 26, 2026, 05:48 PM IST

 Summer Colors: బయట ఎండలు మండిపోతున్నా.. పని మీద బయటకు వెళ్లక తప్పడం లేదా? అయితే... ఈ ఎండల్లో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..సరైన దుస్తులు ధరించడం చాలా ముఖ్యం. 

PREV
13
Summer Colors

మే నెల అయిపోతున్నా బయట ఎండల ప్రభావం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ ఎండలకు తోడు వడగాలులు కూడా కొనసాగుతున్నాయి. ఈ భయంకరమైన ఎండల్లో ఇంట్లో ఉన్నా చెమటలు పట్టేస్తున్నాయి. ఇంత ఎండల్లోనూ పని మీద బయటకు వెళ్లక తప్పడం లేదా? ఈ వేడికి బయటకు వెళితే.. వడ దెబ్బ తగిలే ప్రమాదం చాలా ఉంది. అలా వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే..మనం ఏ రంగు దుస్తులు ధరిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. కొన్ని రంగులు ధరిస్తే.. ఎండ వేడి ఎక్కువగా తగిలే అవకాశం ఉంది. మరి కొన్ని రంగులు ధరిస్తే.. హాయి అనుభూతి కలుగుతుంది. మరి.. ఏ రంగులు ధరించాలి? వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం...

23
దూరంగా ఉండాల్సిన రంగులు...

ఈ ఎండాకాలంలో కచ్చితంగా నలుపు రంగుకు వీలైనంత దూరంగా ఉండాలి. నలుపు రంగుకు వేడిని గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ఎండలో నలుపు రంగు మాత్రమే ధరించకూడదు అనుకుంటారు. కానీ.. ఆకుపచ్చ రంగుకు కూడా దూరంగా ఉండాలి. ఈ రంగు కూడా వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. ఈ రంగుల కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఈ రంగులు ధరించకూడదు.

33
కచ్చితంగా వేసుకోవాల్సిన రంగులు...

1.తెలుపు..

వేసవి కాలానికి తెలుపు రంగు బెస్ట్ అని చెప్పొచ్చు. తెలుపు రంగుకు అధిక ఆల్బెడో ప్రభావం ఉంటుంది. అంటే అది సూర్యరశ్మిని, వేడిని ఎక్కువగా గ్రహించదు.

2. పేస్టెల్ కలర్స్..

ఎండాకాలంలో రోజూ తెలుపు రంగు వేసుకోలేం అనుకునేవాళ్లు.. లేత రంగులు అంటే.. పేస్టల్ కలర్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. WFMY న్యూస్ ప్రకారం, మెరూన్ లాంటి ముదురు రంగు దుస్తులతో పోలిస్తే లేత బూడిద, పేస్టెల్ రంగులు ఎండలో 30 నుండి 35 డిగ్రీల వరకు తక్కువ వేడెక్కుతాయి. ఇవి చల్లగా ఉంటాయి. ప్రశాంతంగా కూడా ఉంటారు. వీటితో పాటు లేత రంగులు అంటే... ఆఫ్ వైట్, క్రీమ్ కలర్ లాంటి రంగులు కూడా వేసుకోవచ్చు. ఎండ వేడి ఎక్కువగా తగలకుండా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories