కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు

Published : Nov 20, 2025, 04:38 PM IST

మనలో చాలామంది చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం తెచ్చుకుంటారు. కోపం సహజమే.. కానీ అది కంట్రోల్ తప్పితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
16
కోపాన్ని కంట్రోల్ చేసుకునే చిట్కాలు

కోపం సహజమైన భావోద్వేగం. ఎవరికైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ సమస్య కోపం రావడంలో కాదు.. దాన్ని నియంత్రించుకోలేకపోవడంలో ఉంది. మనం కోపంతో మాట్లాడే ఒక్కో మాట, తీసుకునే ఒక్కో నిర్ణయం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో లేదా ఆఫీసులో ఒత్తిడి, మన ఆశలు, కోరికలు నెరవేరకపోవడం, మనం ప్రేమించే వ్యక్తి మనల్ని అర్థం చేసుకోకపోవడం వంటివి కోపానికి కారణమవుతాయి. కానీ నిజంగా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంత కష్టమేమి కాదు అంటున్నారు నిపుణులు. కొన్ని సింపుల్ చిట్కాలతో కోపాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

26
10 సెకన్లు ఆగడం

కోపంలో మన మెదడు స్పష్టంగా ఆలోచించదు. మనం అనే మాటలు లేదా చేసే పనులు సరిగ్గా ఉండవు. అందుకే వెంటనే రియాక్ట్ కాకుండా 10 సెకన్లు ఆగడం మంచిది. ఈ 10 సెకన్లలో మన మెదడు తిరిగి ప్రశాంత స్థితికి చేరే అవకాశం ఉంటుంది. 10 వరకు కౌంట్ చేయడం, లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

36
దూరంగా వెళ్లిపోవడం

కోపం ఎక్కువగా మనం ఉన్న పరిస్థితి, ఎదుటి వ్యక్తి, ఆ వాతావరణం వల్ల పెరుగుతుంది. ఆ సమయంలో అదే చోట ఉండటం, అదే వాదన కొనసాగించడం వల్ల కోపం పెరుగుతుంది. అందుకే ఆ క్షణంలో అక్కడినుంచి దూరంగా వెళ్లిపోవడం లేదా కొంచెం నీళ్లు తాగడం మంచిది. ఈ చిన్న మార్పు చేసినా మైండ్‌ సెట్ మారిపోతుంది. ఇది సింపుల్‌గా అనిపించినా.. ప్రాక్టికల్‌గా చాలా ఫలితం ఇస్తుంది.

46
నిజమైన కారణం గుర్తించడం

చాలాసార్లు మనకు కనిపించే కారణమే.. కోపానికి నిజమైన కారణం కాదు. బయట వ్యక్తి చెప్పిన మాటలు మన కోపానికి ట్రిగ్గర్‌ అయినా, అసలు కారణం మాత్రం వేరే ఉండొచ్చు. ఒత్తిడి, అలసట, అసంతృప్తి, అసహనం వంటి ఎన్నో అంతర్గత కారణాలు ఉండొచ్చు. కాబట్టి కోపం వచ్చినప్పుడు అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. సమస్యను అర్థం చేసుకున్నప్పుడు దాని తీవ్రత తగ్గిపోతుంది.

56
మాటలు జాగ్రత్తగా మాట్లాడటం

కోపంలో మాట్లాడే మాటలు మనసును గాయపరుస్తాయి. మనం క్షణికావేశంలో అన్న మాటలు ఇతరులను జీవితాంతం బాధపెడతాయి. అందుకే మాట్లాడే ముందు ఆ మాట అంటే ఏమవుతుందో ఒక్క సెకన్ ఆలోచించాలి. ఈ మాట వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? లేక పెద్దదవుతుందా అని ఆలోచించాలి. కోపంలో వచ్చే మాటల్ని నియంత్రించగలిగితే కోపంపై మనం విజయం సాధించినట్లే అవుతుంది.

66
మనసు ప్రశాంతంగా ఉండేందుకు..

రోజువారీ జీవితంలో ధ్యానం, యోగా, నడక, శ్వాసాభ్యాసం వంటివి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటే, బయటి పరిస్థితులు మనల్ని అంతగా ప్రభావితం చేయవు. కోపం రావచ్చు, కానీ అది క్షణాల్లో తగ్గిపోతుంది. శరీరం, మనస్సు, భావోద్వేగం మూడు మన కంట్రోల్లో ఉంటే.. కోపం మన మీద ప్రభావం చూపే అవకాశం తక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories