షుగర్ పేషెంట్లు గోధుమలు, బియ్యానికి బదులుగా వీటిని తింటే మంచిది..

First Published Dec 17, 2022, 10:52 AM IST

గోధుమలు, బియ్యం మన దేశంలో ప్రధాన ఆహారాల అయినప్పటికీ వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ సూచిక ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు చాలా త్వరగా విచ్చిన్నమవుతాయి. అలాగే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. 
 

షుగర్ పేషెంట్లు గోధుమలను, బియ్యాన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచేస్తాయి. అందుకే వీళ్లు కార్భోహడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. అందుకే గోధుమలు, బియ్యానికి బదులుగా ప్రత్యమ్నాయాలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

diabetes

డయాబెటీస్ అనేది జీవన శైలి వల్ల వచ్చే వ్యాధి. క్లోమం ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్ అయిన ఇన్సులిన్ సాపేక్ష లేదా సంపూర్ణ లోపం వల్ల డయాబెటీస్ వస్తుంది. ఇన్సులిన్ స్థాయి రక్తంలో చక్కెర స్థాయి కంటే తక్కువగా ఉన్నా.. మన శరీరం ఈ  ఇన్సులిన్ ను ఉపయోగించుకోలేకపోయినా. షుగర్ వ్యాధి బారిన  పడతారు. చెడు ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా నేడు ఎంతో మంది టైప్ 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు. 

diabetes diet

సాధారణంగా డయాబెటీస్ ఉన్నవారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. కానీ ఇలా తినేవారు చాలా తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే మన వంటల్లో పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. తక్కువ కార్భోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే బ్రేక్ ఫాస్ట్ ను తింటే మంచిదని నిపుణులు సలహానిస్తున్నారు. 

అయితే చాలా  మంది ఇళ్లలో గోధుమలు, బియ్యమే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రధాన ఆహారాలు వీటితోనే తయారుచేస్తారు కాబట్టి. నిజం చెప్పాలంటే వీటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలు మన శరీరంలో త్వరగా విచ్చిన్నమవుతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని బాగా పెంచుతుంది. 
 

ప్రత్యమ్నాయాలు

గోధుమ, బియ్యంలో గ్లైసెమిక్ సూచి ఎక్కువగా ఉంటుంది. కార్భోహైడ్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. అందుకే వీటికి బదులుగా తక్కువ కేలరీలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, తక్కు కార్భోహైడ్రేట్లు ఉన్న రాగులు, సజ్జలను తినొచ్చు. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే సజ్జలు/ బజ్రా ను  తింటే మంచిది. వీటితో రొట్టెలను తయారుచేసుకుని తినొచ్చు. అలాగే మధుమేహులు మల్టీ గ్రెయిన్ ఓట్స్ ను కూడా తినొనచ్చు. మంచి పోషకాలుండే  ఆహారం కోసం పండ్లుచ మొలకలను కలిపి తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

సజ్జలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది అంత తొందరగా జీర్ణం కాదు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉండదు. ఇవి కండరాలకు శక్తినిస్తాయి. మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉచుతాయి. ఎదిగే పిల్లలు వీటిని తింటే బలంగా తయారవుతారు. ఇవి వారి మెమోరీ పవర్ ను పెంచుతాయి. అలాగే వారి ఎముకలను బలంగా చేస్తాయి. సజ్జ రొట్టెలను తింటే రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి డయాబెటీస్ ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. 

అయితే మధుమేహులు గోధుమలు, బియ్యంతో పాటుగా బంగాళాదుంపలకు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

షుగర్ పేషెంట్లు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను ఏ మాత్రం స్కిప్ చేయకూడదు. అయితే దీన్ని మితంగా తినాల్సి ఉంటుంది. వీటిలో పోషకాలు ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ మిమ్మల్ని రోజంగా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. ఇన్సులిన్ థెరపీ తీసుకుంటున్న వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తే హైపోగ్లైసీమియా, రక్తంలో చక్కెర స్థాయిలు తక్కవ వంటి సమస్యలు వస్తాయి. 
 

click me!