ఈ ఆకుపచ్చని ఆహారాలతో కొవ్వు ఎంత ఫాస్ట్ గా కరుగుతుందో..!

Published : Dec 17, 2022, 09:52 AM IST

కొవ్వును కరిగించడం అంత ఈజీ కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే మాత్రం మీరు ఊహించని విధంగా కొవ్వును కరిగించగలుగుతారు తెలుసా..?   

PREV
16
ఈ ఆకుపచ్చని ఆహారాలతో కొవ్వు ఎంత ఫాస్ట్ గా కరుగుతుందో..!
weight loss

భారతీయ వంటకాలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. రకరకాల మసాలా దినుసులతో కమ్మని వాసనలతో నోరూరిస్తుంటాయి. నిజానికి ఇవి టేస్టీగా ఉండటమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి.  ఎందుకంటే మన వంటకాల్లో మసాలా దినుసులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తక్కువ నూనెతో తయారుచేస్తే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాం. క్రమం తప్పకుండా మసాలా దినుసులను ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే ముప్పు తప్పుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. కొన్ని రకాల మసాలా దినుసులు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా సహాయపడతాయి. బరువు తగ్గేందుకు కూడా ఉపయోపడతాయి. కొవ్వును, బరువును తగ్గించడానికి ఉపయోగపడే ఆకుపచ్చని ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26

పెసరపప్పు

పచ్చ పెసరపప్పులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, ఇనుము, కాల్షియం, పొటాషియంతో పాటుగా ఎన్నో ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే వీటిలో ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ రెండూ మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి ఎంతో సహాయపడతాయి. ఇవి మీరు ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

36

మిరపకాయలు

మిరపకాయలు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి. మిరపకాయల్లో ఉండే  థర్మోజెనిక్  పదార్థం క్యాప్సైసిస్ జీవక్రియను పెంచుతుంది. జీవక్రియ రేటును పెంచడంతో కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుంది. మిరపకాయలను తినడం వల్ల సుమారుగా 3 గంటల పాటు మీ జీవక్రియ రేటు 23 శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. 
 

46
Image: Getty Images

యాలకులు

యాలకులను క్వీన్ ఆఫ్ మసాలా దినుసులు అని కూడా అంటారు. ఇవి మన శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీంతో జీవక్రియ రేటు బాగా పెరుగుతుంది. దీంతో శరీరంలో ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. యాలకులు బరువును తగ్గించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

56

కరివేపాకు

ఈ ఆకులు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తాన్ని బాగా తగ్గిస్తుంది. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలు బయటకు పోయేందుకు, బరువు తగ్గేందుకు సహాయపడతాయి. కరివేపాకు హానికరమైన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను  చాలా వరకు తగ్గిస్తుంది. బరువును తగ్గించుకోవాలనుకుంటే మీ రోజు వారి ఆహారంలో కరివేపాకును తప్పకుండా చేర్చి తినండి. 
 

66

గ్రీన్ టీ

గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. దీంతో మీరు బరువు తగ్గడం సులువు అవుతుంది. ఈ గ్రీన్ టీ క్యాన్సర్ తో కూడా పోరాడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గ్రీన్ టీ తో బరువు తగ్గడం సహజ ప్రక్రియగా మారుతుంది. ఎందుకంటే ఇది ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. ఇది మీరు తక్కువగా తినడానికి సహాయపడుతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories