ఈ పండు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తుంది తెలుసా?

Published : Jan 28, 2023, 01:59 PM IST

మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఎన్నో రోగాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది  గుండెపోటు, స్ట్రోక్ కు దారితీస్తుంది. గుండె జబ్బులొచ్చే ప్రమాదం కూడా రెట్టింపు అవుతుంది.   

PREV
17
ఈ పండు కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తుంది తెలుసా?
high cholesterol

మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండోది చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ ఎన్నో శారీరక విధులకు సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ అలా కాదు. ఇది మన శరీరాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే  గుండె పోటు, స్ట్రోక్ , మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. 

27
High Cholesterol

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్. జీవనశైలి వ్యాధులలో ఇదీ ఒకటి. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో కనిపించే మైనం లాంటి పదార్థం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి వివిధ వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.

37
High Cholesterol

యు.ఎస్. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) ప్రకారం.. సుమారు 40 శాతం మంది అమెరికన్లు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.

47

అయితే కొన్ని ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను బాగా తగ్గించడంలో సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ముఖ్యమైనది అవోకాడో. అవోకాడోలను తినడం వల్ల  చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అవోకాడోల్లో విటమిన్ సి, విటమిన్ కె వంటి  ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అవకాడోలు ఫైబర్ కు మంచి మూలం. ఈ ఫైబర్ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
 

57

ఆరు నెలల పాటు రోజూ అవోకాడోలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తాజా అధ్యయనం పరిశీలించింది. రోజూ అవోకాడోలను తీసుకోవడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అవోకాడోస్ తినడం వల్ల జీవక్రియ కారకాలు మెరుగుపడతాయని పరిశోధకులు  వెల్లడించారు. 

67
avocado

ఈ అవకాడోలు కొలెస్ట్రాల్ స్థాయిలు, శరీర బరువు, బాడీ మాస్ ఇండెక్స్, ఆరోగ్య సంబంధిత జీవన నాణ్యతతో సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగించాయిని పరిశోధకులు కనుగొన్నారు. క్రమం తప్పకుండా అవోకాడోలను తినేవారిలో అనవసరమైన శరీర కొవ్వు తగ్గిందని పరిశోధకులు కనుగొన్నారు.
 

77

అవకాడోలు చర్మానికి, జుట్టుకు కూడా ప్రయోజకరంగా ఉంటాయి. అవకాడో నూనెను వాడటం వల్ల చర్మంపై అయిన గాయాలు తొందరగా మానిపోతాయి. సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని కలిగే అవకాశం  ఉండదు. ఈ నూనె జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడుతుంది. మంటను తగ్గిస్తాయి. అంతేకాదు మొటిమలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.  మధుమేహం, అధిక రక్తపోటు ను నియంత్రణలో ఉంచడానికి ఈ పండు ఎఫెక్టీవ్ గా సహాయపడుతుంది. ఈ పండులో క్యాన్సర్ ముప్పును కూడా తగ్గించే లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories