ఈ ఒక్క ఆకు చాలు కిడ్నీల్లో రాళ్లు, మైగ్రేన్ నొప్పి, బరువు తగ్గేందుకు..

First Published Sep 24, 2022, 11:44 AM IST

నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో దాదాపుగా అందరికీ తెలిసిందే.. కానీ నిమ్మ ఆకు చేసే మేలు గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఇది ఎన్నో రోగాలను ఇట్టే తగ్గిస్తుంది తెలుసా..? 

నిమ్మకాయ ప్రయోజనాలు అందరికే తెలిసినవే. కానీ దీని ఆకుల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ఈ ఆకులు ఔషధం కంటే తక్కువ కాదన్న ముచ్చట మీకు తెలుసా? అవును ఈ ఆకులు ఎన్నో రకాల రోగాలను నివారించడానికి, నియంత్రించడానికి ఉపయోగపడతాయి. కానీ నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయి.. వీటివల్ల ఉపయోగం ఏముందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆకులను తినడం లేదా వాటి రసాన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే  ఆశ్చర్యపోతారు.

నిమ్మ ఆకులను ఎలా తినాలి?

నిమ్మకాయ ఆకులు మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి.  వీటిని అలాగే నమిలి తినొచ్చు లేదా టీలో ఈ ఆకులను కలిపి తీసుకోవచ్చు. ఈ ఆకులు టీకి మంచి టేస్ట్ ను ఇస్తాయి. ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచివి. 

నిమ్మ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు 

నిమ్మకాయ ఆకుల్లో యాంటీ వైరల్, ఆల్కలాయిడ్, యాంటీ ఆక్సిడెంట్, టానిన్, ఫ్లేవనాయిడ్, ఫినోలిక్ మూలకాలు ఉంటాయి. ఈ ఆకుల్లో ప్రోటీన్ కంటెంట్ తో పాటుగా కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా ఉంటాయి. అలాగే యాంథెల్మింటిక్, యాంటీ మైక్రోబయల్, యాంటీ-ఫ్లూలెన్స్, యాంటీ-క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. 

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తుంది!

ఎన్సీబీఐలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. నిమ్మకాయ ఆకుల్లో ఉండే సిట్రిక్ ఆమ్లం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చూడటమే కాదు.. ఆ రాళ్లు పెరగకుండా కూడా నిరోధిస్తుంది. కాబట్టి మీకు మూత్రపిండాల్లో రాళ్లుంటే నిమ్మకాయ ఆకులను తీసుకోవడం మర్చిపోకండి. 
 

మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం

 ఒక అధ్యయనం ప్రకారం.. మైగ్రేన్ నొప్పితో బాధపడేవారికి నిమ్మకాయ ఆకులు మంచి మెడిసిన్ లా ఉపయోగపడతాయి. ఈ నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలుంటాయి.. యాంటీ ఆక్సిడెంట్ శరీర ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. దీంతో మైగ్రేన్ నొప్పి కూడా తగ్గుతుంది. మైగ్రేన్ సమస్యలను, మానసిక ఆరోగ్య సమస్యలను పోగొట్టడానికి ఈ  ఆకులు బాగా ఉపయోగపడతాయి. 
 

నిద్రలేమి నుంచి ఉపశమనం 

పలు పరిశోధన ప్రకారం.. నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి నిమ్మకాయ ఆకులు దివ్య ఔషదంలా పనిచేస్తాయి. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆల్కలాయిడ్లు నిద్రలేమి, నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. ఇలాంటి వారికి నిమ్మ ఆకులతో చేసిన నూనె ప్రయోజనకరంగా ఉంటుంది. 
 

బరువును నియంత్రించడానికి

ఓవర్ వెయిట్ తో బాధపడేవారికి కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి.  నిమ్మఆకులతో తయారుచేసిన జ్యూస్ ను తాగితే బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఎందుకంటే దీనిలో పెక్టిన్ అనే కరిగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం నిమ్మ ఆకులను నీటిలో బాగా మరిగించి తాగాలి. 

click me!