చలికాలంలో మెంతి కూరను తప్పక తినండి.. ఈ అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి..

First Published | Oct 29, 2022, 12:01 PM IST

మెంతికూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ముఖ్యంగా ఈ కూరను శీతాకాలంలో తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అందుకే దీన్ని ఈ సీజన్ లో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఈ సీజన్ లో వచ్చే చల్లటి గాలుల వల్ల రోగాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం, సీజనల్ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ఈ చలికాలంలో మెంతి కూరను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కూర శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మెంతి ఆకుల్లో క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, సెలీనియం, మాంగనీస్ లు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో మెంతి ఆకులను తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. 

Latest Videos


మెంతి ఆకులను ఎలా తీసుకోవాలి?

మెంతి ఆకులను ఎన్నో రకాలు తినొచ్చు. చాలా మంది పచ్చి ఆకు కూరల సలాడ్ ను తయారు చేసుకుని తింటుంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటితో పాటుగా మెంతిఆకులతో పరాటా చేసుకుని కూడా తినొచ్చు. వీటిని పప్పులో కూడా వేయొచ్చు.
 

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఔషధం

మెంతి ఆకుల్లో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు మెంతికూర జ్యూస్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. 

జీర్ణక్రియకు మంచిది

మెంతి ఆకులను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా జరుగుతుంది. ఈ ఆకుల్లో  ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి పొట్టకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కడుపులో ఎలాంటి సమస్య ఉన్నా మెంతి ఆకులను తింటే వెంటనే తగ్గిపోతుంది. 
 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

ఈ రోజుల్లో బరువు పెరగడమనేది సర్వ  సాధారణ సమస్యగా మారిపోయింది. ఆయిలీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహారాలను తింటే బరువు విపరీతంగా పెరిగిపోతారు. దీనికి తోడు శరీరక శ్రమ లేకుంటే కూడా బరువు పెరుగుతారు. కొంతమంది శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం చేస్తుంటారు.అయితే బరువు తగ్గడానికి మెంతి ఆకులు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే మెంతి ఆకుల్లో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. మెంతి ఆకులను తినడం వల్ల ఊబకాయం అదుపులో ఉంటుంది. 
 

ఎముకలను బలపరుస్తాయి

మెంతి ఆకుల్లో ప్రోటీయోమ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెంతి ఆకులను తరచుగా తినడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. ఈ శీతాకాలంలో మెంతి ఆకులను తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. 
 

జుట్టు ఆరోగ్యానికి మంచివి

మెంతి ఆకులు జుట్టు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. మెంతి ఆకులను తీసుకుని గ్రైండ్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు నల్లగా అవుతుంది. అంతేకాదు బలంగా, ఒత్తుగా కూడా పెరుగుతుంది.  మెంతి ఆకుల్లో ఉండే పోషకాలు మీ జుట్టును అందంగా చేస్తాయి. 
 

మెంతి ఆకులు: మెంతి ఆకులలో (Menthi leaves) మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను శుభ్రపరిచి వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో చర్మ సమస్యలను (Skin problems) తగ్గి వృద్ధాప్య ఛాయలకు దూరంగా ఉండవచ్చు.
 

చర్మ ఆరోగ్యానికి మంచివి

మెంతికూర చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల చర్మంపై ఉండే మచ్చలు తగ్గిపోతాయి. మెంతి ఆకులను తరచుగా తింటే మొటిమల సమస్య నుంచి బయటపడతారు. 

click me!