జాగ్రత్త ఈ అలవాట్లు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి..

Published : Oct 29, 2022, 01:10 PM IST

55 ఏండ్ల పైబడిన వారే స్ట్రోక్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో యువత కూడా దీనిబారిన పడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవన శైలి, ఆహారం, కొన్ని రకాల మందులు.   

PREV
16
జాగ్రత్త ఈ అలవాట్లు  స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి..

ప్రతి ఏడాది అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మెదడుకు రక్త సరఫరా సరిగ్గా జరగని పరిస్థితినే స్ట్రోక్ అంటారు. దీనివల్ల మెదడు దెబ్బతింటుంది. దీనికి సకాలంలో చికిత్స తీసుకోకపోతే.. చనిపోయే అవకాశం ఉంది. మారుతున్న జీవన శైలి, జన్యు మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచ వ్యాప్తంగా స్ట్రోక్ బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.
 

26
stroke

అయితే ఈ స్ట్రోక్ ఎక్కువగా 55 ఏండ్లు పైబడిన వారికే వస్తుంటుంది. కానీ నేడు యువత కూడా స్ట్రోక్ బారిన పడుతున్నారు. మారుతున్న జీవన శైలి, ఆహారం, కొన్ని రకాల మందులు కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

36
stroke

స్ట్రోక్ ప్రధాన లక్షణాలు.. తీవ్రమైన తలనొప్పి, శరీరంలో తిమ్మిరి, ముఖం, కాళ్ళపై తిమ్మిరి, అలసట, మాట్లాడటంలో ఇబ్బంది, గందరగోళం, వాంతులు, వికారం, మగత, శరీరం సమతుల్యతను కోల్పోవడం, కంటి చూపు మందగించడం. రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో తరచుగా రక్తం గడ్డ కడుతుంది. దీనివల్ల రక్తస్రావం కూడా కావొచ్చు. రక్తనాళం పగిలి రక్తం మెదడులోకి వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంది. 

46
stroke

ఆల్కహాల్ మోతాదుకు మించి తాగడం వల్ల రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి పెరగడం వల్ల రక్తం గడ్డకడుతుంది. వ్యాయామం లేదా శారీరక శ్రమ బాగా తగ్గినప్పుడు స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది. 

56
stroke

పొగాకును ఉపయోగించడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే ఇది గుండె, రక్త నాళాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు ఇది రక్తపోటును కూడా పెంచుతుంది. అధిక కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్స్, ఉప్పు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే మద్యపానాన్ని ఎక్కువగా తాగకండి. బరువును నియంత్రణలో ఉంచుకోండి. ధూమపానాన్ని మానేయండి. వీటిని వీలైనంత తొందరగా మానేస్తే.. స్ట్రోక్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకున్న వారవుతారు. 

66

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే స్ట్రోక్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఒక వయోజనుడు ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు మితమైన వ్యాయామం, అలాగే 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తుంది. రన్నింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
 
స్ట్రోక్ కు దారితీసే ప్రమాద కారకాలు చాలానే ఉన్నాయి. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, ఊబకాయం, నిశ్చల జీవనశైలి, చెడు ఆహారం, వాపు, జీవక్రియ వ్యాధులు వంటివన్నీ స్ట్రోక్ కు దారితీస్తాయి. 


 

Read more Photos on
click me!

Recommended Stories