నిజానికి చక్కెర మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల బరువు పెరగడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలు దారుణంగా పెరుగుతాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే చక్కెరకు బదులు బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఇనుము ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తం లోపం రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. దీనిలో కేలరీలు, ప్రోటీన్, మంచి కొవ్వు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.