చలికాలంలో హెయిర్ ఫాల్, చుండ్రు వంటి జుట్టు సమస్యలు రాకూడదంటే ఇలా చేయండి..

First Published Nov 15, 2022, 12:59 PM IST

చలికాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతుంది. చుండ్రు కూడా వస్తుంది. ముఖ్యంగా వెంట్రుకలు మధ్యలోకి తెగిపోతుంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే చిట్కాలను పాటించండి.
 

Image: Getty Images

జుట్టు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే సీజన్లు మారుతుంటే.. జుట్టుపై చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా జుట్టు రాలిపోతుంది. చుండ్రు సమస్య వస్తుంది. అలాగే వెంట్రుకలు పగిళిపోతాయి. ముఖ్యంగా వెంట్రుకలు మధ్యలోకి తెగిపోతుంటాయి. ఇలాంటి సమస్యలు రాకూడదంటే.. ఎలాంటి జుట్టు సంరక్షణ చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఈ సీజన్ లో జుట్టు గరుకుగా మారుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల ఇలా అవుతుంటుంది. అలాగే జుట్టు డ్రై గా కూడా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే చలికాలంలో జుట్టుకు నూనె పెట్టి బాగా మసాజ్ చేయండి. నూనె వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. డ్రైనెస్ పోతుంది. గరుకుదనం కూడా పోతుంది. 

చలికాలంలో వెంట్రుకల కొనలు రెండుగా అయితయ్. అందుకే శీతాకాలంలో జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంట్రుకలు కొనలు పగిలిపోతే.. జుట్టు ఏం చేసినా పెరగను గాక పెరగదు.  అందుకే ఈ సీజన్ లో పగిలిన కొనలను తరచుగా కట్ చేస్తూ ఉండండి. అలాగే నెత్తికి బాదం నూనెను ఉపయోగించండి. ఈ నూనె జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది. 
 

చలికాలంలో నెత్తిలో చుండ్రు ఎక్కువగా ఏర్పడుతుంది. దీనివల్ల వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతాయి. కొత్త వెంట్రుకలు మొలిచే అవకాశం మొత్తమే తగ్గుతుంది. ఇలా జరగకూడదంటే నిమ్మకాయను ముక్కలుగా కోయండి. వీటిని నెత్తిమీద రుద్దండి. కొద్దిసేపయ్యాక షాంపూతో తలస్నానం చేయండి. నిమ్మకాయలో చుండ్రును వదిలించే లక్షణాలు ఉంటాయి. 
 

Image: Getty Images

ఈ సీజన్ లో నెత్తిమీద విపరీతంగా దురద పెడుతుంది. మాడు పొడిబారితే.. నెత్తిమీద దురద పెడుతుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి పెరుగు, గుడ్డు ప్యాక్ లను జుట్టు కు అప్లై చేయొచ్చు. అలాగే క్రమం తప్పకుండా ఆయిల్ మసాజ్ చేసినా మంచి ప్రయోజనం పొందుతారు. 
 

ఇతర కాలాలతో పోల్చితే.. ఒక్క శీతాకాలంలోనే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. దీని నుంచి బయటపడడాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. సరైప ప్రొడక్ట్ లనే ఉపయోగించాలి. జుట్టును ఆరోగ్యంగా ఉంకే  తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే.. హెయిర్ ఫాల్ సమస్య దూరమవుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. 

click me!