మార్కెట్లో లభించే బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ, రాస్ బెర్రీ లను స్మూతీస్ లేదా షేక్స్ రూపంలో చేసుకుని తాగితే మంచిది. ఇందులో ఉన్నటువంటి ఖనిజలవనాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మన శరీరానికి అవసరమయ్యే రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మన శరీరంలో జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించడానికి దోహదపడుతుంది. ఇక చేమంతి పూలతో టీ తయారు చేసుకునే తాగటం వల్ల మన శరీరంలో ఎముకలు దృఢంగా మారడమే కాకుండా బోలుఎముకల వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది అలాగే మహిళలలో వచ్చే రుతుక్రమ నొప్పిని కూడా నివారించడానికి దోహదపడుతుంది.