warm water benefits: పొద్దు పొద్దున్నెవేడినీళ్లు తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా?

First Published Jan 25, 2022, 9:50 AM IST

warm water benefits:శరీరానికి అవసరమైన నీళ్లు తాగినప్పుడే బాడీ డీ హైడ్రేషన్ కు గురికాకుండా, ఆరోగ్యంగా ఉంటుంది. నీళ్లతోనే మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. అందుకే వైద్యులు రోజుకు కనీసం 7 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తుంటారు. అయితే చలికాలంలో మాత్రం గోరువెచ్చని నీళ్లను తాగాలని సూచిస్తున్నారు. ఎందుకంటే..? 
 

warm water benefits: రక్తాన్ని ద్రవ రూపంలో ఉంచాలన్నా, మనం తిన్న ఆహార రసం శరీరంలో కలవాలన్నా, శరీర ఉష్ణోగ్రతను కాపాడాలన్నా నీరు ఎంతో ముఖ్యం. అంతేకాదు శరీరంలో నిల్వ ఉన్న చెడు పదార్థాలను చెమట లేదా మూత్రం ద్వారా బయటకు పంపేది ఈ నీరే. మానవునికి ప్రాణాధారమైనది ఏదైనా ఉందంటే అది నీరనే చెప్పాలి. అందుకే ప్రతి మనిషి ఆరోగ్యంగా బతకాలంలో  నిత్యం 3 లీజర్ల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. 

ఒకప్పుడు మన పెద్దలు చల్లనీళ్లకు బదులుగా వేడినీళ్లనే ఎక్కువగా తాగేవారు. ఎందుకంటే ఈ వేడి నీటి వల్ల ఎన్నో అద్బుత ప్రయోజనాలున్నాయన్న సంగతి వాళ్లకు తెలుసు గనుక. కానీ మనం మాత్రం చల్లని నీళ్లను ..  లేదా ఫ్రిజ్ వాటర్ ను  తాగడం అలవాటు చేసుకున్నాం. అయితే చలికాలంలో కూడా ఈ చల్లటి నీళ్లను తాగడం శరీరానికి అంత మంచిది కాదు. అందుకే ఆరోగ్యానికి మేలు చేసే గోరువెచ్చటి నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. అందులోనూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చటి నీళ్లను తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

ఉదయం లేచిన తర్వాత మీ రోజును ఒక గ్లాసు వేడినీళ్లతో ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందులోనూ సీజనల్ వ్యాదులైన జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి అనేక సమస్యలకు ఈ వేడినీళ్లే బెస్ట్ మెడిసిన్ లా పనిచేస్తాయి. అంతేకాదు రోజుకు 7నుంచి 8 గ్లాసుల వేడినీటిని తాగడం వల్ల మనపై చల్లగాలుల ప్రభావం తక్కువగా ఉంటుంది. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో ఉండే టాక్సిన్లు నశించి పోయి వ్యర్థాలుగా బయటకు పంపబడతాయి. అలాగే చర్మ రక్షణకు, కేశాల సంరక్షణకు వేడి నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఎవరైతే పొడిదగ్గుతో బాధపడుతున్నారో వారికి చక్కటి నేచురల్ రెమెడీగా ఉపయోగపడుతుంది. అలాగే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొనేవారికి ఈ వేడి నీళ్లు చక్కటి ఔషదం లా పనిచేస్తాయి. ముఖ్యంగా శ్వాసనాళాన్నితేలికగా చేయడంలో ముందుంటాయి. వేడినీళ్లతో ఒకే ఒక్క రోజులో టాన్సిల్ సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే తీవ్రమైన గొంతునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా లేదా బరువుగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ వేడినీ తాగితే ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా శరీరం తేలిగ్గా అనిపిస్తుంది. 
 

ఉదయమే కాదు రాత్రి పడుకునేటప్పుడు కూడా వేడినీళ్లను నీళ్లను తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పేగుల్లో పేరుకుపోయిన మలినాలను క్లీన్ చేయడంలో ఈ నీళ్లు బాగా పనిచేస్తాయి. అలాగే మలబద్దకం సమస్య నుంచి బయపడొచ్చు. అందులోనూ బరువు తగ్గడానికి కూడా ఈ నీళ్లు బాగా ఉపయోగపడతాయి. సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా ఇవి రక్షిస్తాయి. అలాగే మానసికి ఒత్తిడితో బాధపడుతున్నవాళ్లు  రాత్రుళ్లు ఒక్క గ్లాసు వేడి నీటిని తాగితే చక్కటి ఫలితం ఉంటుంది. నిద్రకూడా ప్రశాంతంగా పడుతుంది. అజీర్థి సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య కూడా మటుమాయం అవుతుంది.  

click me!