Benefits of Dates: ఖర్జూరంతో ఆ సమస్యలన్నీ పరార్..

First Published Jan 23, 2022, 2:09 PM IST

Benefits of Dates: కాలాలతో పాటుగా మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ఎందుకంటే సీజన్లతో పాటుగా రకరకాల జబ్బులు కూడా మనవెంటే ఉంటాయి. అందుకే వివిధ సీజన్లలో లభించే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. అందులో చలికాలంలో ఖర్జూరం పండు మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. 

Benefits of Dates: ఖర్జూరం పండ్లు చలికాలంలో తినడం వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పండులో ఖనిజాలు, విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, రాగి, పాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి తినడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాదు.. మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముందుంటాయి. మరి ఈ చలికాలంలో ఖర్జూరాలను తినడం వల్ల కలిగే లాభాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..

చలికాలంలో చలితీవ్రత బాగా ఉంటుంది. అందువల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా పడిపోతూ ఉంటుంది. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఖర్జూరం తింటే గుండెపోటు ముప్పు వచ్చే అవకాశం చాలా తక్కువ. అంతేకాదు ఖర్జూరం శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగించేస్తుంది. దీన్ని తింటే రక్తపోటు, గుండె పోటు నుంచి రక్షణ పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 


చలికాలంలో శరీరానికి తగినంత ఎండ లభించదు. దీని వల్ల మనకు అవసరమయ్యే డి విటమిన్ అందదు. దీనికారణంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎముకలు బలంగా ఉండటానికి డి విటమిన్ ఎంతో అవసరం. ఈ సమస్యను ఖర్జూరం తో పరిష్కరించవచ్చు. ఈ పండులో క్యాల్షియం మెండుగా లభిస్తుంది. దీన్ని తింటే దంతాలు, ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. అంతేకాదు ఈ పండులో మెగ్నీషియం, పొటాషియం, రాగి వంటివి పుష్కలంగా లభించడం వల్ల కీళ్లు అరగడం, కీళ్ల నొప్పులు, అనేక ఎముకల సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చు. 


ఖర్జూరంతో రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. ఈ పండులో ఐరన్ పుష్ఠిగా లభిస్తుంది. అలాగే అలాగే హిమోగ్లబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు వెళ్లడిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లోనే ఎక్కువగా ఐరన్ లోపం కనిపిస్తూ ఉంటుంది. దీంతో వారికి జుట్టు విపరీతంగా ఊడిపోవడం, తరచుగా నీరసంగా అయిపోవడం, రోగనిరోధక శక్తి తగ్గుముఖం పట్టడం, చర్మం పాలిపోవడం, హర్మోన్ల హెచ్చుతగ్గులు, గర్భస్రావం వంటి అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమస్యలన్నింటికి ఖర్జూరం నివారణగా పనిచేస్తుంది. అంతేకాదు పిండం ఎదుగుదలకు కూడా ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది.
 

మలబద్దకం సమస్యను నివారించడానికి, జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో ఈ పండు బాగా సహాయపడుతుంది. అంతేకాదు తిన్న ఆహారం సరిగ్గా ఒంటికి పట్టేలా చేస్తుంది. 
 

tiredness in kitchen

కొంతమంది రాత్రంతా హాయిగా పడుకున్నా పొద్దున లేచిన వెంటనే నీరసంగా, అలసటగా, మందకొడిగా, నిస్సత్తువగా కనిపిస్తారు. అలాంటి వారు రోజుకు రెండు మూడు ఖర్జూరాలను తింటే మంచి ఫలితతం ఉంటుంది. తక్షణ శక్తిని అందించి మిమ్మల్ని హుషారుగా చేస్తుంది. గంటల తరబడి వ్యాయామం చేసేవారికి జీడిపప్పు, ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఇవి తొందరగా అలసిపోకుండా చేస్తాయి.  

చలికాలంలో చర్మ సంరక్షణకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో చల్లటి గాలుల ప్రభావంతో స్కిన్ లోని సహజ నూనెలు తగ్గే అవకాశం ఉంది. ఈ సీజన్ లో చర్మ సంరక్షణకు ఖర్జూరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి కాంతివంతమైన చర్మం కోసం కావాల్సిన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు చర్మం తేమ తగ్గకుండా చేసి స్కిన్ కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. 

click me!