benefits honey: నాభికి తేనె రాయడం వల్ల ఎన్నో అద్భుతాలు జరుగుతాయన్నసంగతి మీకు ఎరుకేనా..?

First Published Jan 23, 2022, 12:57 PM IST

benefits honey: ఒక్క తేనే చుక్క చాలు ఎన్నో అనారోగ్య సమస్యలను తరిమికొట్టడానికి. అందుకే ఆరోగ్య నిపుణులు తేనేను ఎక్కువగా తాగాలని సూచిస్తుంటారు. అందులోనూ ఒక్క తేనే చుక్కను బొడ్డుపై రాస్తే ఎన్నో సమస్యలను పరార్ చేయొచ్చన్న సంగతి మీకు ఎరుకేనా..

benefits honey: తేనె యాంటి ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని వల్ల తేనె మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కించడంలో కూడా తేనె ముందుంటుంది. తేనె కూడా స్వీటే కదా అని చక్కెరను ఉపయోగించకూడదు. ఎందుకంటే తేనెలో ఉన్నన్ని ఔషద గుణాలు చక్కెరలో ఉండవు కాబట్టి. అందులోనూ చక్కెరకు బదులుగా ఈ తేనెను ఉపయోగించడమే చాలా బెటర్. తేనె శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ తేనెను బొడ్డుకి రాయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు మటుమాయం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొడ్డుపై తేనె రాయడం వల్ల కలిగే లాభాలేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

జీర్ణక్రియ.. ప్రస్తుత కాలంలో చాలా మంది జీర్ణక్రియ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించకపోతే పెను ప్రమాదాన్నే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాగా దీనికి చక్కటి పరిష్కారంలా తేనె ఉపయోగపడుతుంది. కొంచెం తేనె తీసుకుని అందులో కాస్త అల్లం రసం కలిపి బొడ్డుపై రాయాలి. ఇలా చేస్తే మీ జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇలా చేయడం వల్ల పొత్తి కడుపు నొప్పుులు కూడా మటుమాయం అవుతాయి. 
 

బొడ్డుతాడు ఇన్ఫెక్షన్లు.. ప్రతి రోజూ బొడ్డును క్లీన్ గా చేయకపోతే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అందుకే నాభిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అయితే తేనె ద్వారా కూడా నాభిని క్లీన్ గా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా చేయొచ్చు. అదెలాగంటే.. కొంచెం తేనె తీసుకుని అందులో కాస్త అల్లంరసం కలిపి బొడ్డుపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల హనీ లోని యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఫంగల్ గుణాలు ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది. 

constipation

మలబద్ధకం:  ప్రస్తుత కాలంలో మలబద్దకంతో బాధపడేవారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అని అనుకునే వారికి చక్కటి పరిష్కార మార్గం దొరికింది. క్రమం తప్పకుండా తేనెను బొడ్డులో వేస్తే ఈ మలబద్దకం నుంచి తొందరగా బయటపడతారు. 

పొడి చర్మంతో బాధపడేవారికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది తేనె.  డ్రై నెస్ నుంచి బయటపడాలంటే ప్రతి రోజూ కొన్ని చుక్కల తేనెను బొడ్డుపై అప్లై చేయాలి. దీని వల్ల చర్మం డ్రై నెస్ కోల్పోవడంతో పాటుగా ముఖం కాంతివంతంగా, నిగనిగమెరిసిపోతుంది.  
 

ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మొటిమలు. హార్మోన్ల హెచ్చుతగ్గులు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల మొటిమలు వస్తుంటాయి. సాధారణంగా వచ్చే ఈ పింపుల్స్ తెగ చికాకు పెట్టిస్తుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా తేనె బాగా ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ బొడ్డుపై తేనె రాయడం వల్ల ముఖం ఏర్పడిన మొటిమలను ఈజీగా వదిలించుకోవచ్చు. 
 

 పై సమస్యలన్నింటికీ తేనె చక్కటి పరిష్కారం చూపిస్తుంది. అయితే నాభికి తేనెను కేవలం రాత్రి సమయంలో అదికూడా పడుకునే ముందే అప్లై చేయాలి. రాత్రి పూట కష్టం అనుకుంటే పగటి పూట కూడా బొడ్డుపై తేనే రాయొచ్చు. కానీ అది అప్లై చేసిన తర్వాత పక్కాగా రెండు గంటలు రెస్ట్ తీసుకోవాలి. 
 

click me!