మెరిసే కాంతివంతమైన చర్మ సౌందర్యం కోసం రాగి పిండి ఫేస్ ప్యాక్.. ఇలా చేస్తే అందమే అందం!

First Published Jan 23, 2022, 12:56 PM IST

వాతావరణంలోని మార్పులు, పోషకాల లోపం ఇలా మొదలగు కారణాలతో ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. దాని నుండి చర్మాన్ని కాపాడుకోవడానికి అనేక వేల రూపాయలు ఖర్చు చేసిన ఆశించిన ఫలితం లభించదు. అయితే ఇంటిలోనే అందుబాటులో ఉండే రాగి పిండితో (Ragi flour) ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తే చర్మ సౌందర్యం (Skin beauty) మెరుగుపడుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

రాగి పిండితో తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్  (Face pack) లను ఉపయోగిస్తే చర్మాన్ని కాంతివంతంగా చేయడంతోపాటు లోపలినుండి ఆరోగ్యంగా (Health) తయారుచేస్తాయి. ఈ పేస్ ప్యాక్ లు చర్మానికి సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ ల సహాయపడతాయి. 
 

రాగులలో ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్, ఎ, బి, సి, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి కావలసిన పోషకాలు (Nutrients) అందించి చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. వృద్ధాప్య ఛాయలను (Aging shades) తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సాయపడతాయి.
 

చర్మం కాంతివంతంగా తయారవుతుంది: ఒక కప్పులో కొద్దిగా రాగి పిండి (Ragi flour), ఒక స్పూన్ తేనె (Honey), ఒక స్పూన్ పచ్చిపాలు (Milk) వేసి బాగా కలుపుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడిగేయాలి. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
 

చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది: ఒక కప్పులో ఒక స్పూన్ రాగి పిండి (Ragi flour), ఒక స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ (Orange peel powder), ఒక స్పూన్ గంధం (Sandalwood), పచ్చి పాలు (Milk) వేసి ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా కనీసం వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
 

మృత కణాలు తొలగిపోతాయి: ఒక కప్పులో ఒక స్పూన్ రాగి పిండి (Ragi flour), ఒక స్పూన్ పంచదార (Sugar), ఒక స్పూన్ శనగపిండి (Besan), ఒక స్పూన్ ఆయిల్ (Oil) వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పాలలో ముంచిన కాటన్ బాల్ సహాయంతో ముఖాన్ని శుభ్ర పరుచుకొని తరువాత ముఖానికి కలుపుకున్న మిశ్రమంతో స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేశాక చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మ కణాలలోని దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోతాయి.
 

చర్మం తాజాగా ఉంటుంది: ఒక కప్పులో రెండు   స్పూన్ ల రాగి పిండి (Ragi flour), ఒక స్పూన్ బియ్యప్పిండి (Rice flour), ఒక స్పూన్ తేనె (Honey), ఒక స్పూన్ నిమ్మరసం (Lemon juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చర్మం తాజాగా ఉంటుంది.

click me!