పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఇలా చేయండి

First Published Jan 23, 2023, 4:54 PM IST

చాలా మంది ఆడవారిని వేధించిన సమస్యల్లో బెల్లీ ఫ్యాట్ ఒకటి. నిజానికి బెల్లీ ఫ్యాట్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. 
 

ఆడవారు, మగవారు అంటూ ప్రతి ఒక్కరూ బెల్లీ ఫ్యాట్ తో బాధపడుతున్నారు. నిజానికి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడం అంత సులువు కాదు. కానీ ఈ బెల్లీ ఫ్యాట్ ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు పేరుకుపోతే మీ ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. ఇది ఈ కొవ్వు వల్ల మీరు ఓవర్ వెయిట్ పెరగడమే కాదు బెల్లీ ఫ్యాట్ మీ అంతర్గత అవయవాలను చుట్టుముట్టి, డయాబెటిస్, కాలేయ సమస్యలు, గుండె జబ్బులు వంటి రోగాలకు దారితీస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును ఎలా సులువుగా కరిగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

 మీకు స్పష్టమైన లక్ష్యం ఉండాలి

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి  ముందు మీరు చేయాల్సిన పని స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండాలి. ఉదాహరణకు.. మీరు బెల్లీ ఫ్యాట్ ను కరిగించాలనుకుంటే అందుకే మీరు ఏం చేయాలో ముందే నిర్ణయించుకోవాలి. ఇది మీ లక్ష్యాలను సాధించడానికి మీకు సహాయపడుతుంది.

belly fat

పెద్ద కండరాల సమూహాలకు శిక్షణ

పెద్ద కండరాల సమూహాలకు శిక్షణ ఇవ్వడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి బాగా సహాయపడతాయి. ఇందుకోసం స్క్వాట్స్, డెడ్లిఫ్ట్స్, ఛాతీ ప్రెస్, లెగ్ పుల్-డౌన్స్ ను చేయొచ్చు. అయితే మీరు మీరు మీ ఉదరాలకు శిక్షణ ఇవ్వకపోయినా.. కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. కేలరీలను బర్న్ చేయనప్పటికీ కోర్ కండరాలను అభివృద్ధి చేయడానికి ఇది చాలా అవసరం. 
 

కేలరీలను తగ్గించండి

మీరు బరువు తగ్గడానికి కేలరీలను తీసుకోవడం తగ్గించడం గొప్ప మార్గం. దీనివల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. ఇందుకోసం మీరు మీ రోజువారీ ఆహారంలో కేలరీలను 20 నుంచి 25 శాతం తగ్గించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

నడవండి, నడవండి, నడవండి

ఎంత నడిస్తే అంత ఆరోగ్యం. మీరు ప్రతిరోజూ కనీసం 12,000 అడుగులు నడిచేలా చూసుకోండి. ఒకవ్యక్తి ఇన్ని అడుగులు నడిస్తే .. ఆ వ్యక్తి రోజంతా చురుకుగా ఉంటాడని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ బలాన్ని పెంపొందించుకోవడానికి కూడా సహాయపడుతుంది. అలాగే మీ మొత్తం బరువును అదుపులో ఉంచడానికి కూడా సహాయపడుతుంది.
 

మీ నిద్ర విధానాన్ని మెరుగుపరచండి

బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి నిద్ర విధానం కూడా చాలా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. తొందరగా నిద్రపోయి.. తొందరగా నిద్రలేవడం వల్ల బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు పక్కాగా నిద్రపోండి. 
 

click me!