దానిమ్మ రసంతో బరువు తగ్గడమే కాదు.. ఆ సమస్యలు కూడా నయమవుతాయి

First Published Jan 23, 2023, 4:07 PM IST

దానిమ్మ రసాన్ని రెగ్యులర్ గా మీ డైట్ లో భాగం చేసుకుంటే మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తొలగిపోతాయి. దానిమ్మ రసమే కాదు ఆ పండు చర్మం, పండు, పువ్వు, ఆకులో కూడా ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. 

దానిమ్మ పండు అందాన్ని పెంచడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ కె , విటమిన్ బి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసాన్ని రెగ్యులర్ గా తాగితే మీ ఇమ్యూనిటీ పవర్ మెరుగుపడుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. దానిమ్మ రసంతో పాటుగా దానిమ్మ పండు చర్మం, పండు, పువ్వు, ఆకు కూడా మన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అసలు దానిమ్మ జ్యూస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ  రసంలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తమ డైట్ లో చేర్చుకోవచ్చు. 100 గ్రాముల దానిమ్మ గింజల్లో 83 కేలరీలు ఉంటాయి. దానిమ్మ రసం ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీన్ని తాగితే అతిగా తినే అలవాటు పోతుంది. దీంతో మీరు తొందరగా బరువు తగ్గుతారు.

pomegranate juice

దానిమ్మ రసంలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల దానిమ్మ రసం జీర్ణ సమస్యను తగ్గించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మ పండును తింటే అజీర్థి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గిపోతాయి.

రోజూ దానిమ్మ పండును తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఇది చక్కగా సహాయపడుతుంది. దానిమ్మ పండును తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అందుకే వీటిని తప్పకుండా తీసుకోండి. 

కొలెస్ట్రాల్ ను తొలగించడానికి కూడా దానిమ్మ ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మలో ఉండే నైట్రిక్ యాసిడ్ ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వును తొలగించడానికి బాగా సహాయపడుతుంది. దానిమ్మ పండు 90 శాతానికి పైగా కొవ్వు, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హార్ట్ పేషెంట్లకు కూడా దానిమ్మ పండు చాలా మంచివి. వీటిని రోజూ డైట్ లో చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

pomegranate juice

దానిమ్మ పండు హై బీపీని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే దానిమ్మ జ్యూస్ జ్యూస్ ను రోజూ తాగండి.

click me!