ఈ కూరగాయలు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.. తప్పక తినండి

First Published Jan 23, 2023, 2:52 PM IST

సిగరేట్ ను కాల్చడం, కలుషితమైన గాలిని పీల్చడం, నిశ్చల జీవన శైలి వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ అలవాట్లను మానుకుని మీ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆహారం కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. 
 

lungs health

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. మానవ శరీరం సక్రమంగా పనిచేయడానికి  కీలక పాత్ర పోషించే అవయవం కూడా ఊపిరితిత్తులే. అందుకే వీటిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యమంటారు ఆరోగ్య నిపుణులు. నిజానికి ఊపిరితిత్తుల వ్యాధులు తరచుగా సరిగ్గాలేని జీవనశైలి వల్లే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ధూమపానానికి దూరంగా ఉండటం, కలుషితమైన గాలిని పీల్చకపోవడం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఊపిరితిత్తులను కొంతవరకు కాపాడుకోవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సలహానిస్తున్నారు. కొన్ని రకాల కూరగాయలు మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

beet root


బీట్ రూట్

బీట్ రూట్ బరువు తగ్గడం నుంచి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడం వరకు ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. నైట్రేట్ పుష్కలంగా ఉండే బీట్ రూట్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

బచ్చలికూర

బచ్చలికూర, కాలె, మునగాకు వంటి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ను ప్రమాదాన్ని నివారించడానికి కూడా సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

tomatoes

టమాటాలు

టమోటాలు పోషకాలు, విటమిన్ల భాండాగారం. టమోటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి తరచుగా టమాటా జ్యూస్ ను తాగుతూ ఉండండి. 

cabbage

క్యాబేజీ

పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల్లో క్యాబేజీ ఒకటి. క్యాబేజీని ఆకుకూరల జాతికి సూపర్ హీరో అని వర్ణిస్తారు కూడా. క్యాబేజీలు సాధారణంగా ఆకుపచ్చ, తెలుపు , ఊదా రంగుల్లో ఉంటాయి.  క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ సిలతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ లు పష్కలంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే క్యాబేజీ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
 

click me!