శనగపిండి ఫేస్ ప్యాక్ తో ముఖంపై మచ్చలు, మొటిమలు మాయం.. ఎలా తయారుచేయాలంటే?

Published : Dec 21, 2023, 01:50 PM IST

ముఖంపై ఒక్క మచ్చగాని, మొటిమ గానీ ఉండకూడని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఈ చర్మ సమస్యలు మాత్రం కొందరిని వదలవు. అయితే సమస్య సమస్యలను వదిలించుకోవడానికి శనగపిండి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది తెలుసా? అవును దీన్ని ఉపయోగించుకుని ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.   

PREV
15
శనగపిండి ఫేస్ ప్యాక్ తో ముఖంపై మచ్చలు, మొటిమలు మాయం.. ఎలా తయారుచేయాలంటే?
Image: Getty Images

మన చర్మాన్ని  ఆరోగ్యంగా ఉంచడానికి, కాంతివంతంగా చేయడానికి సహజ పద్దతులే మంచివి. ఎందుకంటే వీటివల్ల ఎలాంటి చెడు ప్రభావం పడదు. అయితే మన చర్మానికి శెనగపిండి ఎంతో మేలు చేస్తుంది తెలుసా? అవును ఇది మన ముఖంపై మచ్చలు లేకుండా చేస్తుంది. అలాగే ముఖం కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. శనగపిండి ఫేస్ ప్యాక్ ను ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలన్నీ తగ్గిపోతాయి. 

25

శనగపిండిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ జింక్ మన చర్మానికి మెరుపును ఇస్తుంది. అలాగే స్కిన్ ను మృదువుగా చేస్తుంది. అలాగే శనగపిండిని ఉపయోగించడం వల్ల చర్మంపై ఉన్న అదనపు ఆయిల్ కూడా తొలగిపోతుంది. 

35

శనగపిండిని ఉపయోగించడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇది చర్మానికి మంచి స్క్రబ్ గా కూడా ఉపయోగపడుతుంది. శనగపిండిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మం వృద్ధాప్య లక్షణాలను కొంతవరకు నివారించడానికి సహాయపడతాయి. మరి ముఖ అందాన్ని పెంచడానికి శనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

45

face pack

1. శనగపిండిని పసుపును సమాన పరిమాణంలో తీసుకుని రెండింటినీ కలపండి. వీటిలో కొన్ని పాలు కలిపి ప్యాక్ లా  తయారుచేయండి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేయొచ్చు.

55

2. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక చెంచా శనగపిండి, బియ్యప్పిండి, బాదంపొడిని వేసి కలపండి. తర్వాత దీనిలో కొంచెం పెరుగును వేసి బాగా మిక్స్ చేయండి. ప్యాక్ రెడీ అయిన తర్వాత ముఖానికి, మెడకు బాగా అప్లై చేయండి. ఇది ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోండి. ముఖంపై మొటిమలను తొలగించడానికి ఈ ప్యాక్ అద్బుతంగా సహాయపడుతుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories