ఇలా చేశారంటే చలికాలంలో ఫాస్ట్ గా బరువు తగ్గుతరు

First Published Dec 21, 2023, 12:58 PM IST

చలికాలంలో బరువు తగ్గడం చాలా చాలా కష్టమని అనుకుంటారు. ఎందుకంటే ఈ సీజన్ లో వ్యాయామం చేయరు. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ ను తింటారు. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మాత్రం మీరు సులువుగా బరువు తగ్గుతారు. 

weight loss

చలికాలంలో ప్రతి ఒక్కరూ వేడివేడిగా, వేయించిన ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. అంటే సమోసాలు, జజ్జీలు, పకోడీలను ఎక్కువగా తింటారన్న మాట. ముందే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి.. వేడి వేడిగా తింటుంటే బలే ఉంటుంది. కానీ ఈ ఆహారాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని ఎక్కువగా తింటే మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే బరువు తగ్గడానికి చలికాలం ఉత్తమ సమయం అంటారు నిపుణులు. ఎందుకంటే ఈ సీజన్ లో మనం బాగా నిద్రపోతాం. ఇది జీవక్రియను పెంచుతుంది. మరి ఈ సీజన్ లో బరువు తగ్గాలనుకునేవారు ఏమేమీ చేయాలో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Weight Loss Tips

పోషకాహారం

చల్లని ఉష్ణోగ్రతలు సహజంగానే మన శరీర జీవక్రియను పెంచుతాయి. దీంతో ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. అందుకే పోషకాలు ఎక్కువగా ఉండే, శరీరాన్ని వేడెక్కించే ఆహారాలను తినండి. ఇవి మీరు ఎక్కువ కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. 
 

Weight Loss Tips

చురుగ్గా ఉండండి

చలికాలంలో శారీరక శ్రమ చాలా వరకు తగ్గుతుంది. కానీ బరువు తగ్గడానికి పక్కాగా శారీరక శ్రమ అవసరం. శారీరక శ్రమ మీ బరువును తగ్గించడమే కాకుండా.. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. అందుకే వారానికి 3 నుంచి 5 రోజులు ఏదో ఒక రకమైన శారీరక శ్రమలో పాల్గొనండి. ఇది కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఈ సీజన్ లో కొన్ని ఫ్రైడ్ ఫుడ్స్ తిన్నా వ్యాయామం ద్వారా కేలరీలను తగ్గించుకోవచ్చు.

Weight Loss Tips

హెర్బల్ టీ

చలికాలంలో చాలా మంది పాలు, పంచదార కలిపిన టీ లేదా కాఫీలనే ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇందులో ఉండే షుగర్ ఊబకాయాన్ని పెంచుతుంది. అందుకే మిల్క్ టీకి బదులుగా హెర్బల్ టీని తాగండి. ఇది మీ ఫుడ్ కోరికలను తగ్గిస్తుంది. అలాగే మీ జీవక్రియను పెంచేటప్పుడు మీ శరీరాన్ని వెచ్చగా చేస్తుంది.
 

Weight Loss Tips

పండ్లు

చలికాలంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే రకరకాల సీజనల్ పండ్లు మార్కెట్ లో దొరుకుతాయి. ఈ పండ్లను డైట్ లో చేర్చుకుంటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు అనారోగ్యకరమైన ఆహారాలను తినకుండా ఉంటారు. 

Weight Loss Tips

హైడ్రేటెడ్ గా ఉండండి

చలికాలంలో మీరు మరింత హైడ్రేటెడ్ గా ఉండటానికి ప్రయత్నించండి. ఇందుకోసం నీటిని పుష్కలంగా తాగాలి. అప్పుడే మీ శరీరంలోని విష పదార్థాలు బయటకు పోతాయి. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. అలాగే కొవ్వు ఫాస్ట్ గా కరగడం మొదలవుతుంది. అంతేకాకుండా నీరు మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఆకలిని కలిగించదు. అలాగే మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

click me!