ఏం చేస్తే గొప్ప పేరెంట్స్ అవుతారో తెలుసా?

First Published | Dec 21, 2023, 1:33 PM IST

నిజమైన గొప్ప పేరెంట్స్ పిల్లలు విజయం సాధిస్తేనే ప్రేమ కురిపించడం కాదు. వారు సక్సెస్ అయినా, అవ్వకపోయినా కూడా ఒకేలాంటి ప్రేమ చూపిస్తారు.

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలపై అమితమైన ప్రేమ కురిపిస్తూ ఉంటారు. వారు అడగకముందే అన్ని తెచ్చి ఇవ్వాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమకంటే, తమ పిల్లల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.  ఇవన్నీ కాదు కానీ,  మీరు ఫెంటాస్టిక్ పేరెంట్స్ గా మారాలి అంటే.. ఏం చేయాలో ఈ రోజు తెలుసుకుందాం..

ఒక గొప్ప పేరెంట్ పిల్లల పై అమితమైన ప్రేమ కురిపిస్తారు. పిల్లలు ఎంత అల్లరి చేసినా భరిస్తారు. అర్థం చేసుకుంటారు. చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. పిల్లలు తమ నిర్ణయాలు మార్చుకుంటున్నా కూడా అర్థం చేసుకుంటారు.

Latest Videos


నిజమైన గొప్ప పేరెంట్స్ పిల్లలు విజయం సాధిస్తేనే ప్రేమ కురిపించడం కాదు. వారు సక్సెస్ అయినా, అవ్వకపోయినా కూడా ఒకేలాంటి ప్రేమ చూపిస్తారు.
 

అంతేకాదు.. పిల్లలు ఏం చెప్పినా ఓపికగా వింటారు. వారు తీసుకునే నిర్ణయాలను జడ్జ్ చేయడం లాంటివి చేయరు. వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటారు. వారి ఆలోచనలు, భయాలను అర్థం చేసుకుంటారు.
 

నిజానికి పిల్లలు ఎక్కువ విషయాలను తమ తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. చాలా అలవాట్లు తల్లిదండ్రుల దగ్గర నుంచే  నేర్చుకుంటారు. కాబట్టి, గొప్ప పేరెంట్స్ మాత్రం తమ పిల్లలకు ఈ విషయంలో మంచి ఎగ్జాంపుల్ గా నిలుస్తారు.
 

గొప్ప పేరెంట్స్... తమ పిల్లలకు ఫిజికల్ గా, మెంటల్ గా  మంచి భద్రతగా ఉండే పరిస్థితులను క్రియేట్ చేశారు. ఈ పేరెంట్స్ పిల్లలు అన్ని విషయాలు ఎక్స్ ప్లోర్ చేయడానికీ, అన్ని విషయాలు నేర్చుకోవడానికి అన్నీ వీలు కలిగేలా చేస్తారు.

గొప్ప పేరెంట్స్.. తమ పిల్లలకు ఇండిపెండెంట్ గా ఉండటం నేర్పుతారు. తమ పిల్లలను అన్ని విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంతేకాదు, పిల్లలకు కొన్ని విషయాలు షెడ్యూల్ చేస్తూ ఉంటారు. అంటే, ఉదయం లేచే సమయం, బెడ్ టైమ్, బ్రేక్ ఫాస్ట్ లాంటివి రోజూ ఒకే టైమ్ కి తీసుకునేలా అలవాటు చేస్తారు. 


తమ పిల్లలతో చాలా ఓపికగా ఉంటారు.  వాళ్లని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. పిల్లలకు టఫ్ సమయంలోనూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.

click me!