Health Tips: నిద్రపోకపోతే అందం తగ్గుతుంది జాగ్రత్త..

Published : Feb 11, 2022, 12:31 PM IST

Health Tips: అందంగా కనిపించాలని ఎవరికుండదు చెప్పండి. నలుగురిలో తామే అందంగా మెరిసిపోవాలని అమ్మాయిలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకే రకరకాల క్రీములు, సబ్బులు గట్రా వాడుతూ ఉంటారు. అయితే అందం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కంటినిండా నిద్రలేకపోతే అవన్నీ వేస్టేనని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..? 

PREV
16
Health Tips: నిద్రపోకపోతే అందం తగ్గుతుంది జాగ్రత్త..

Health Tips: అలసిన శరీరానికి నిద్ర ఎంతో అవసరం. నిద్రతోనే శరీరం కొత్త శక్తిని పుంజుకుంటుంది. అంతేకాదు ఈ నిద్రతోనే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కంటినిండా నిద్రిస్తేనే అందం కూడా రెట్టింపవుతుందని మీకు తెలుసా.. అవును ఇది నిజంగా నిజం. నిద్రతో అందాన్ని రెట్టింపుచేసుకోవచ్చు. సరిపడా నిద్రిస్తే చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. స్కిన్ కలర్ ఎలాంటిదైనా కానీయండి.. అందంగా కనిపించాలంటే మాత్రం చర్మం ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. స్కిన్ ఆరోగ్యంగా ఉండాలంటే కంటినిండా నిద్రపోవాలి. అప్పుడే మీ అందం రెట్టింపు అవుతుంది.
 

26

ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మారిన మన జీవన విధానం, తీసుకునే ఆహారం వంటి ద్వారా కూడా నిద్రలేమి సమస్య వస్తుంది. వీటికి తోడు నిద్రపోయే సమయాన్ని మరిచి ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల్లో మునిగిపోవడం వల్ల కూడా నిద్రకు దూరమవుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లను రాత్రుళ్లు చూడటం వల్ల ఆ స్క్రీన్ వెలుతురు మన కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. తద్వారా మనకు నిద్ర దూరమవుతుంది. అందుకే పడుకునే అరగంట ముందే వీటన్నింటికి దూరంగా ఉండాలి.
 

36

సూర్యకాంతి కూడా మన నిద్రకు ఎంతగానో సహాయపడుతుంది. ఎలా అంటే సూర్యకాంతి ద్వారా మన శరీరంలో మెలటోనిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతుంది. అది నిద్ర రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ కాసేపు ఎండలో ఉండేలా చూడండి. ఇకపోతే పడుకునే ముందు మీ గది  కిటికీలు, తలుపులు తెరిచి ఉంచితే కూడా నిద్ర బాగా పడుతుంది. ఎందుకంటే కిటికీల ద్వారా స్వచ్ఛమైన గాలి లోపలికి వస్తుంది. తద్వారా మీకు నిద్ర బాగా పడుతుంది. 

46

నిద్రకు మెలటోనిన్ అనే హార్మోన్ ఎంతో అవసరం. కాగా ఈ హార్మోన్ మనం లేట్ గా పడుకుంటే చాలా తక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. దాంతో మీరు నిద్రపోలేరు. అందుకే ప్రతిరోజూ త్వరగా పడుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట హాయిగా పడుకోవాలంటే మాత్రం ఫుడ్ ను లేట్ గా తీసుకోకూడదు. దీనివల్ల స్టమక్ లో గ్యాస్, అజీర్థి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటివల్ల నిద్ర దూరమవుతుంది. కాబట్టి రాత్రి పూట కంటినిండా నిద్రపోవాలంటే లేట్ గా తినకూడదు.

56

తలకు మసాజ్ చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది. అందుకే పడుకునే ముందు కాసేపు తలను మసాజ్ చేయండి. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాదు అలసట కూడా మటుమాయం అవుతుంది. అలాగే మీ ఫర్ ఫ్యూమ్ కొట్టుకునే అలవాటుంటే మీ దిండు చుట్టూరా ఫర్ ఫ్యూమ్ ను స్ప్రే చేయండి. దీనివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 

66

రాత్రుళ్లు ఎంత బాగా నిద్రిస్తే అంత రెట్టింపు అందం మీ సొంతమవుతుంది. నిద్రవల్ల చర్మం కాంతివంతంగా, తాజాగా అవుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా బేషుగ్గా ఉంటుంది. కాబట్టి కంటినిండా నిద్రపోండి.  అందంగా కనిపించండి.

Read more Photos on
click me!

Recommended Stories