Happy Promise Day 2022: ఎలాంటి ప్రామిస్ లు చేస్తే ఆమె సంతోషిస్తుందో తెలుసా..?

First Published | Feb 11, 2022, 9:59 AM IST

Happy Promise Day 2022: వాలెంటైన్ వీక్ లో ఐదో రోజు రానే వచ్చింది. నేడు ప్రామిస్ డే. మరి ఈ రోజున మీ లవర్ కు ఎలాంటి ప్రామిస్ లు చేద్దామనుకుంటున్నారు. మీ లవర్ లేదా.. మీ వైఫ్ మీ నుంచి ఎలాంటి ప్రామిస్ లను ఆశిస్తుందో తెలుసా..
 


Happy Promise Day 2022: ప్రేమలో ఉన్నప్పుుడు తమ లవర్లకు నేను ఈ పనిచేయను, ఇది చేస్తాను అని ఒట్టు వేయడం, మాట ఇవ్వడం చాలా సులువు. కానీ వాటిని జీవితకాలం నిలబెట్టుకోవడమే చాలా కష్టం. ప్రేమలోనే కాదు భార్యాభర్తల బంధం, స్నేహితుల మధ్యలో కూడా ఈ ప్రామిస్ లు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇవే ప్రేమికుల మధ్య, స్నేహితుల మధ్య, భార్యభర్తల మధ్య బంధాన్ని ఎల్లకాలం ఉండేలా చేస్తాయి. ఇకపోతే ప్రస్తుతం ప్రేమికులు వాలెంటైన్ వీక్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ వీక్ లో ప్రతిరోజూ స్పెషలే. కాగా ఈ రోజు ప్రామిస్ డే. మరి ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిల నుంచి ఎలాంటి ప్రామిస్ లను ఆశిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..
 


ప్రామిస్ లు నీ కోసం నేనున్నానని భరోసా కల్పిస్తాయి. అంతేకాదు ఈ ప్రామిస్ లే ఒక బంధం కలకాలం ఎలాంటి కలహాలు లేకుండా సాఫీగా సాగేలా చేస్తాయి. ముఖ్యంగా విడిపోయిన బంధాలను కలపడానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. ఒక బంధం కలకాలం నిలవాలన్నా, విడిపోవలన్నా మీరు చేసే ప్రామిస్ ల పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీ స్వచ్ఛమైన ప్రేమను ఎల్లకాలం నిలుపుకోవడానికి మీ ప్రియమైన వారికి ప్రామిస్ లు చేసి మీ ప్రేమను తెలియజేయండి. ఒక అమ్మాయి అబ్బాయి నుంచి లేదా భర్తనుంచి ఎలాంటి ప్రామిస్ లు ఆశిస్తుందో ఇప్పుడు చూద్దాం.
 



మన మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా నన్ను ఎప్పటికీ వదలనని మాటివ్వు. నన్నేప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. నా పట్ల నువ్వెప్పుుడూ కేర్ లెస్ గా ఉండకూడదని అబ్బాల నుంచి ఇలాంటి ప్రామిస్ లను ఆశిస్తారు.

Image: Getty Images

జీవితం పట్ల కేర్ లెస్ గా ఉండకూడదు. ఇప్పటి నుంచి నువ్వు డబ్బులను వేస్ట్ గా ఖర్చు పెట్టకూడదు. పొదుపు చేయాలి. కాల్ మాట్లాడుతూ అస్సలు డ్రైవింగ్ చేయకూడదు.
 


వాట్సాప్, ఫేస్ బుక్ లల్లో ఎక్కువ సేపు ఉండకూడదు. గతంలో మన మధ్యన జరిగిన గొడవలన్నీ మర్చిపోయి హాయిగా ఉందాం. వాటిని మళ్లీ మళ్లీ గుర్తుచేయకూడదు. నువ్ ఇలా అన్నావ్.. అలా అన్నావ్ అని గుర్తుచేసుకోకూడదు. డ్రైవింగ్ సేఫ్ గా చేయి అటూ అబ్బాయిల నుంచి ఇలాంటి ప్రామిస్ లను ఆశిస్తుంటారు అమ్మాయిలు. 

మీకోటి తెలుసా.. అబ్బాయిల లైఫ్ కు అమ్మాయిల లైఫ్ కు చాలా తేడాలుంటాయి. అబ్బాయిలకున్న స్వేచ్ఛ అమ్మాయిలకు ఉండదు. అంతేకాదు అబ్బాయిల ప్రపంచంలో ఎన్నో ఉంటాయి. కానీ అమ్మాయిల ప్రపంచంలో తాను ఇష్టపడ్డ అబ్బాయొక్కడే ఉంటాడు. ప్రేమికుడైనా సరే భర్తైనా సరే అమ్మాయిలకు వీళ్లకు మించిన వేరే లోకం ఏదీ ఉండదు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా వీరితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. అందుకే వారు కోరిన ఆ చిన్న ప్రామిస్ లను బ్రేక్ చేయకుండా వారిని సంతోషపెట్టేలా ప్రవర్తించండి. 

అబ్బాయిల నుంచి అమ్మాయిలు కొన్ని విషయాలను ఎప్పటికీ ఆశిస్తుంటారు. అవి చాలా చిన్నవిషయాలే అయినప్పటికీ అవే వారి అంతులేని ఆనందానికి దారితీస్తాయి. కాబట్టి వాటిని ఎప్పటికీ మరువకంటి. అవేంటంటే..

నీ జీవితంలో నేను ఒక అతిముఖ్యమైన వ్యక్తిగా గుర్తుండిపోవాలి. నన్ను ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. ఎటువంటి సమస్య ఎదురైనా ఇద్దరం కలిసి ఎదుర్కొందాం. నా పట్ల నువ్వెప్పుడు నిజాయితీగానే ఉంటాలి. అబద్దం అనే మాటలకు మన మధ్య తావుండకూడదనే విషయాలను అబ్బాయిల నుంచి ఆశిస్తుంటారు.

అమ్మాయిలకు సంబంధించి వారి పుట్టినరోజు, పెళ్లి రోజు, వారి ఫస్ట్ మీట్ డే, ఎంగేజ్ మెంట్ రోజు అనేవి అమ్మాయిలకు ఎంతో స్పెషల్ డేస్. అందుకే వాటిని గుర్తుంచుకుని వారికి సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తూ ఉంటే వారెంతో సంతోషిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే వారంటే మీకెంత ఇష్టమో తెలియజేస్తాయి. 

అప్పుడప్పుడు కొన్ని సర్ ప్రైజ్ పాన్ల్ చేస్తూ వారిని సంతోషపెట్టాలి. ముఖ్యంగా అప్పుడప్పుడు వారికి వారు ఊహించని విధంగా గిఫ్ట్ లు ఇస్తూ ఉంటే కూడా వారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. 
 


నీకు పెద్ద బంగ్లా కట్టిస్తాను. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను అనే అబద్దపు మాటలను చెప్పకండి. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరికీ కష్టాలు రావడం సర్వసాధారణం. కాబట్టి నీ ప్రతి కష్టంలో నేను తోడుంటా అనే మాటను ఇవ్వండి చాలు.. వారికి అదే గొప్ప ప్రేమ కానుక అవుతుంది. 
 

Latest Videos

click me!