bathukamma 2023: పూల పండుగలో ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ.. ప్రత్యేకతలేంటో తెలుసా?

bathukamma 2023: పూజ సంబురం మొదలై రెండో రోజులు అయిపోయింది. ఈ రోజు మూడో రోజు. ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మను జరుపుకోబోతున్నాం. ఈ రోజుకు కూడా ఎంతో ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? 
 

Bathukamma 2023

bathukamma 2023: ఈ పూల పండుగ తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి ప్రతీకగా మారింది. ఈ పండుగను ప్రతి ఏడాది వర్షాకాలం చివరన, చలికాలం ప్రారంభానికి ముందు జరుపుకుంటారు. వర్షాకాలం వానలు సాధారణంగా తెలంగాణలోని చెరువులు, కుంటల్లో నీటిని నిండుగా నింపుతాయి. ఇక ఈ ప్రాంతంలోని సాగు చేయని, బంజరు మైదానాలలో అడవి పువ్వులు రకరకాల రంగులలో వికసించే సమయం కూడా ఇదే. వీటిలో సమృద్ధిగా ఉండే పువ్వులు గునుగు, తంగేడు. బంటి, చామంతి, నంది వర్ధనం వంటి పువ్వులు. 
 

ఇక ఈ సీజన్ సీతాఫలాలు కూడా బాగా పండుతాయి. సీతాఫలం ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది తక్కువ లేదా వాటర్ లేకున్నా అడవిలో పెరుగుతుంది. దీనిని ఎక్కువగా పేదవాడి ఆపిల్ అని పిలుస్తారు. అంతేకాదు ఈ ఇప్పుడు మొక్కజొన్న కోతకు వచ్చే సమయం కూడా. వీటన్నింటి నడుమ ఆడపడుచులు తీరొక్క పువ్వులతో ప్రకృతి అందాలను ఆలపిస్తూ బతుకమ్మను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
 


దసరాకు రెండు రోజుల ముందు వచ్చే సద్దుల బతుకమ్మకు వారం రోజుల ముందు ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగకు ఎక్కడెక్కడో ఉన్న ఆడపడుచులంతా తమ పుట్టింటికి వచ్చి ఈ పూల పండుగను జరుపుకుంటారు. 

వారం రోజుల పాటు చిన్న చిన్న బతుకమ్మలను పేర్చి ప్రతిరోజూ సాయంత్రం పూట వీటి చుట్టూ బతుకమ్మ పాటలు చెప్పుకుంటా ఆడుకుంటారు. అలాగే దగ్గర్లో ఉన్న చెరువులో వీటిని నిమజ్జనం చేస్తారు. ఇక చివరి రోజున అయితే మగవారు ఉదయాన్నే నిద్రలేచి పూలున్న మైదానాల్లోకి వెళ్లి గునుగు, తంగేడు వంటి పూలను తీసుకొస్తారు. 

బతుకమ్మను తాంబాళంలో గోపురం ఆకారంలో పేరుస్తారు. బతుకమ్మను అందరూ రంగురంగుల పువ్వులను ఉపయోగించినప్పటికీ.. ఏ ఒక్క బతుకమ్మ కూడా ఒకేలాగా ఉండదు. బతుకమ్మ స్పెషలీ ఇది. 

ఇప్పటికే మనం ఎంగిలి పూల బతుకమ్మను, అటుకుల బతుకమ్మను జరుపుకున్నాం. ఈ రోజు మూడో రోజు బతుకమ్మను జరుపుకుంటున్నాం. తొమ్మిది రోజుల బతుకమ్మలో ఏ రోజుకారోజు ప్రత్యేకం. తొమ్మిది రోజుల పండుగలో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. మూడోరోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. అయితే ఈ రోజు ముద్దపప్పు, బెల్లం, పాలతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే మూడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. 

Latest Videos

click me!