Bath: స్నానానికి ఏ నీళ్లు మంచివో తెలుసా?

Published : Jan 31, 2022, 04:38 PM IST

Bath: పూర్వ కాలంలో చాలా మటుకు అందరూ స్నానానికి చల్ల నీళ్లనే ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం వేడి నీళ్లైతేనే స్నానం చేస్తాను అనే వారు చాలానే ఉన్నారు. అందుకే ప్రతి ఇంటికి గీజల్లు లేదా హీటర్లు ఉంటున్నాయి. వాస్తవానికి ఏ నీటితో స్నానం చేస్తే మంచిది. ఏ నీళ్లు మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసా.. 

PREV
15
Bath: స్నానానికి ఏ నీళ్లు మంచివో తెలుసా?

Bath:చలికాలం వేడి నీళ్లతో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో కదూ.. కానీ స్నానానికి వేడినీళ్లకంటే చల్ల నీళ్లే మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులోనూ వేడినీళ్ల స్నానం వల్ల కొన్ని సమస్యలను తప్పక ఎదుర్కోవాల్సి వస్తుంది. వేడినీళ్లతో స్నానం చేస్తే శరీరం రిలాక్స్ అవుతుందనేది నిజం. కానీ దీనివల్ల నిద్ర రావడం, మత్తుగా అనిపించడం వంటి సమస్యలు ఎదురౌతాయి. దానివల్ల రోజంతా భారంగా గడపాల్సి వస్తది. అంతేకాదు ఆఫీసుల్లో , ఇతర పనులు చేసుకునే వారు తమ పనులపై శ్రద్ధను పెట్టలేదు. అంతేకాదు ఇబ్బందిగా కూడా ఫీలవ్వాల్సి వస్తుంది. 

25

కాగా చన్నీళ్ల వల్ల అన్ని ఉపయోగాలే ఉన్నాయి.. కానీ నష్టాలు మాత్రం లేవు. ఎలాగంటారా.. చన్నీళ్ల స్నానం చేసేముందు ఒక మగ్ నీల్లు ఒంటి మీద పడేదాకే ఇబ్బంది పడాల్సి వస్తది. కానీ ఆ తర్వాత మీకు పట్టుకున్న నిద్రమత్తంతా ఒక్కసారిగా వదిలిపోతుంది. అంతేకాదు చల్ల నీళ్లు ఒంటిపై పడగానే బాడీ ఉత్తేజంగా మారుతుంది. అంతేకాదు రోజంతా ఎంతో యాక్టీవ్ గా గడుస్తుంది. కాబట్టి వేడి నీళ్లకంటే చల్ల నీళ్లే మనకు మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చన్నీళ్ల స్నానం వల్ల అందం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

35

చల్లనీళ్లతో ముఖం కడగడం వల్ల ముఖంపై ఉండే చిన్న చిన్న రంధ్రాలు కూడా తగ్గిపోతాయట. అందుకే కదా ప్రస్తుతం ఐస్ మాస్క్ ఫేమస్ అయ్యింది. దీన్ని ఉపయోగించడం వల్ల చాలా ఉపయోగాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకి ఐస్ మాస్క్ అంటే ఏమిటో తెలుసా.. ఒక పాత్ర తీసుకుని అందులో కొన్ని నీళ్లను పోసి వాటికి కొన్ని ఐస్ క్యూబ్స్ ను ఆడ్ చేస్తారు. అందులో ముఖాన్ని కొద్ది సేపు పెడతారు. ఈ ప్రాసెస్ వల్ల మొఖంపై ఉండే రంధ్రాలు పోతాయి. అంతేకాదు ముఖం ఫ్రెష్ గా కూడా తయారవుతుంది. అలాగే అందం కూడా రెట్టింపు అవుతుంది. 

45


వేడినీటితో స్నానం ఎప్పుడు చేయాలి: ఉదయం కంటే రాత్రి సమయంలో వేడి నీళ్ల స్నానం చేయడం మంచిది. ఎందుకంటే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. పొద్దంతా కష్టపడి అలసిన శరీరానికి వేడి నీళ్ల వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.  అంతేకాదు హాయిగా కూడా నిద్రపోతారు. కాబట్టి ఉదయం కంటే రాత్రి పూట మాత్రమే వేడినీళ్ల స్నానం చేయండి. 

55

అయితే చల్లనీళ్ల స్నానం కొన్నిఅనారోగ్య సమస్యలున్నవారికి అంత మంచిది కాదు. మైగ్రేన్, సైనస్ వంటి సమస్యలున్నవారు చల్లనీటితో స్నానం చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే వీరు చల్లనీళ్లతో స్నానం చేస్తే ఆ సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలున్నవారు చలికాలం లో గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం మంచిది. అదే వేసవి కాలమైతే ఎవ్వరైనా చల్లనీటితోనే బేషుగ్గా స్నానం చేయొచ్చు.  

  

Read more Photos on
click me!

Recommended Stories