టేస్టీ ఎగ్ లెస్ మిల్క్ కేక్ రెసిపీ... ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

Navya G   | Asianet News
Published : Jan 31, 2022, 03:16 PM IST

బర్త్ డే, ఫంక్షన్లకు కేకును బయటినుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా కేక్ ను తయారు చేసుకోవచ్చు. కేక్ తయారీ విధానం చాలా కష్టమని అనుకోకండి. తక్కువ పదార్థాలతో (Less ingredients) ఎంతో సులభంగా ఎగ్ లెస్ మిల్క్ కేక్ (Eggless milk cake) ను తయారు చేసుకోవచ్చు. బట్టర్, మిల్క్ ఫ్లేవర్ తో ఈ కేక్ చాలా స్మూత్ గా భలే టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కేక్ తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..   

PREV
16
టేస్టీ ఎగ్ లెస్ మిల్క్ కేక్ రెసిపీ... ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!

కావలసిన పదార్థాలు: 180 గ్రాములు మైదా (Maida)  పిండి, 180 గ్రాముల పంచదార (Sugar), 60 గ్రాముల మిల్క్ పౌడర్ (Milk powder), ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ (Baking powder), 180 గ్రాములు బటర్ (Butter), పావు కప్పు మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ (Mixed Dry Fruits).
 

26

తయారీ విధానం: ముందుగా మైదాపిండిని, బేకింగ్ పౌడర్ ను తీసుకుని జల్లెడ (Sift) పట్టుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 180 ml ల నీళ్లను, 180 గ్రాముల పంచదారను వేసి బాగా కరిగేలా కలుపుకోవాలి (Mix well to dissolve).
 

36

పంచదార కరిగిన తర్వాత ఇందులో మైదా పిండి మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించుకున్న బటర్ (Melted butter) ను వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. పిండిని కలిపే సమయంలో ముఖ్యంగా పిండిని ఒకే డైరెక్షన్ లో  కలుపుకోవడం ముఖ్యం. అప్పుడే కేక్ గా స్మూత్ (Smooth) గా వస్తుంది.
 

46

ఇలా బాగా కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని బటర్ రాసి పొడి పిండిని చల్లుకున్న అల్యూమినియం కేక్ గిన్నెలో (Aluminum cake bowl) వేసుకోవాలి. కేక్ మిశ్రమాన్ని గిన్నెలో ముప్పావు భాగం మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని విజిల్ లేకుండా (Without whistle) ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి.
 

56

ఐదు నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి కేక్ గిన్నెను స్టాండ్ పై పెట్టి మూత పెట్టి విజిల్ లేకుండా అరగంటపాటు తక్కువ మంట (Low flame) మీద కుక్ చేసుకోవాలి. కేక్ తయారు కావడానికి 35- 40 నిమిషాల సమయం పడుతుంది. అరగంట తర్వాత టూత్ పిక్ (Tooth pick) సహాయంతో కేక్ తయారు అయిందో లేదో పరీక్షించుకోవాలి.
 

66

కేక్ తయారైన తరువాత బాగా చల్లారనివ్వాలి (Let cool). కేక్ ను ఒక ప్లేట్ లోకి తీసుకొని పైన డ్రైఫ్రూట్స్ తో గార్నిష్ (Garnish) చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఎగ్ లెస్ మిల్క్ కేక్ రెడీ. ఇంకెందుకు ఆలస్యం మీరు ఒకసారి కేక్ ను ట్రై చేయండి.

click me!

Recommended Stories