అరటితో అంతులేని లాభాలు.. ఎలా తిన్నా భలే ఉపయోగాలు...

First Published Jun 4, 2021, 5:12 PM IST

పండ్లలో అద్భుతం అరటిపండు. రెండు అరటిపండ్లు తిని గ్లాసెడు మంచినీళ్లు తాగితే భోజనం పూర్తయినట్టే. ఈ విషయాన్నే సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, రచయిత రుజుటా ​​దివేకర్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పుకొచ్చారు. 
 

పండ్లలో అద్భుతం అరటిపండు. రెండు అరటిపండ్లు తిని గ్లాసెడు మంచినీళ్లు తాగితే భోజనం పూర్తయినట్టే. ఈ విషయాన్నే సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, రచయిత రుజుటా ​​దివేకర్ ఒక సోషల్ మీడియా పోస్ట్ లో చెప్పుకొచ్చారు.
undefined
మండే వేసవిలో అరటిపండును ఎందుకు తినాలి? దీన్ని ఆహారంలో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చారు.
undefined
వేసవిలో ఉదయమే ఫస్ట్ మీల్ గా దీన్ని తీసుకోవచ్చని చెప్పారు. వర్కవుట్ చేయడానికి ముందు లేదా చేసిన తరువాత తినొచ్చు, భోజనానికి ముందు మినీ మీల్ గా తినొచ్చని చెప్పుకొచ్చారు.
undefined
భోజనంలో అరటిపండును అనేకరకాలుగా చేర్చవచ్చు. అరటిపండు పాలు, అరటిపువ్వు, అరటి పిండితో వంటకాలు ఇలా ఎన్నోరకాలు చేయచ్చు.
undefined
అయితే వేసవికాలంలో శరీరంలో వేడిని తగ్గించడానికి మన అమ్మమ్మలు చెప్పు కొన్ని చిట్కాలు ఆమె చెప్పుకొచ్చారు.
undefined
అరటిపండులో ఆసిడ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఉదయమే అరటిపండుతో మీ రోజును మొదలు పెట్టొచ్చు. దీనివల్ల అసిడిటీని అరికట్టవచ్చు. మైగ్రైన్, మజిల్ క్రంప్స్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.
undefined
హైపోథైరాయిడిజం వల్ల శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్లను తయారు చేయలేని పరిస్థితి నెలకొంటుంది. అందుకే శరీరానికి కావాల్సిన శక్తి ని అందించే మంచి రిసోర్స్ గా అరటిపండు పనిచేస్తుంది. మీ మూడ్ ను ఉత్తేజపరుస్తుంది. అందుకే మిడ్ మీల్ గా అరటిపండును తినడం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది.
undefined
పాలు, చక్కెర, రోటీలతో అరటిపండు కలిపి తినడం శుక్రన్ సాంప్రదాయ భోజనం. దీని వల్ల తలనొప్పి, మైగ్రేన్లను తరిమికొట్టవచ్చు. అలాగే, జీర్ణం కావడం సులభం కాబట్టి పిల్లలకు భోజనంగా మంచిది.
undefined
మనలో చాలామందికి భోజనం ముగించడానికి అరటిపండును తింటుంటాం. అనేక హోటల్స్ లో కూడా లంచ్ లో ఒక అరటిపండు ఇస్తుంటారు. కారణం అరటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, అరటిలో ఫ్రక్టోజ్ తక్కువ స్థాయిలో ఉంటుంది, ఇది ఐబిఎస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
undefined
రోజుకు మూడుపూటలా కాకుండా.. తక్కువ విరామాల్లో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా తినే అలవాటు ఉన్నట్లైతే అరటి మిల్క్ షేక్ మీకు చాలా మంచిది. లేట్ నైట్ చదువులు, వర్క్ లు చేసేవారికి, ఆన్ లైన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు, వ్యాయమం తరువాత తీసుకోవడానికి అనువైన ఫుడ్.
undefined
అరటిపండులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. జీర్ణం సులభంగా అవుతుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఎక్కడైనా దొరుకుతుంది. అయితే.. స్థానికంగా దొరికే రకానికే ప్రాధాన్యత నివ్వాలి. దీనివల్ల కల్తీని అరికట్టవచ్చు అని ఆమె చెబుతున్నారు.
undefined
click me!