ఈ కూరగాయలను తింటే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుందంతే..

Published : Sep 17, 2022, 12:45 PM IST

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.   

PREV
18
ఈ కూరగాయలను తింటే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుందంతే..
high cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల భవిష్యత్తులో ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాయామం చేయకపోవడం, మారుతున్న లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీంతో గుండెకు చేరే రక్త ప్రవాహానికి అడ్డంకి ఏర్పడుతుంది. కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. 

28
healthy vegetables

శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఛాతిలో నొప్పి,  అలసట, మైకము, రక్తపోటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ.. కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే కొలెస్ట్రాల్ ను కొంతవరకు తగ్గించవచ్చు. అయితే కొన్ని కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే.. 

38

బీన్స్

బీన్స్ లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు బీన్స్ ను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 
 

48

బచ్చలి కూర

బచ్చలి కూరలో ఐరన్, కాల్షియం, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీర కొవ్వును తగ్గించే టాప్ ఫుడ్స్ లో బచ్చలికూర ఒకటి. బచ్చలికూరలో విటమిన్ బి, మెగ్నీషియం, విటమిన్ ఇ లకు కొదవే ఉండదు. ఈ కూరను  మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. 
 

58

బెండకాయ

బెండకాయ బరువును తగ్గించడమే కాదు శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిండంలో కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఎందుకంటే వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ కూడా బెండకాయలో పుష్కలంగా ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు బెండకాయను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం మంచిది. 
 

68

టమాటాలు

టమాటాలు లేని కూర ఉండటం దాదాపు అసాధ్యమే. టమాటాలతోనే కూర కంప్లీట్ అవుతుంది. అందుకే ప్రతిఒక్క కూరలో టమాటాను ఖచ్చితంగా వేస్తారు. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కెలు పుష్కలంగా ఉంటాయి. ఈ టమాటా చర్మం, కళ్లు, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. టమాటాల్లో  పుష్కలంగా ఉండే పొటాషియం కొలెస్ట్రాల్ ను, రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
 

78

బ్రోకలీ

బ్రోకలీలో ఆరోగ్యకరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో విటమిన్ సితో పాటుగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది  కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.బ్రోకలీలో బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నివారించడంలో సహాయపడుతుంది.
 

88

వంకాయ

వంకాయలో ఖనిజాలతో పాటుగా విటమిన్లు కూడా ఎక్కువ  మొత్తంలో ఉంటాయి. ఈ వంకాయ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీనిలో ఫైటోన్యూట్రియెంట్లు కూడా పష్కలంగా ఉంటాయి. వంకాయలో కాఫీక్, క్లోరోజెనిక్ ఆమ్లం వంటి ఫినోలిక్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories