వీటిని తింటే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది తెలుసా?

Published : Jan 16, 2023, 10:06 AM IST

శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే ఎన్నో ప్రమాదకరమైన రోగాలొస్తాయి. ముుఖ్యంగా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు పెరుగుతాయి.   

PREV
19
వీటిని తింటే కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోతుంది తెలుసా?
cholesterol

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కనిపించకపోవచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే కొంతమంది కాళ్ళలో తిమ్మిరి, మోకాలి నొప్పి, మెడ వెనుక భాగంలోని చర్మంలో బెణుకు, గోర్ల రంగులో మార్పు, పెళుసైన గోళ్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండెపోటుకు దారితీసే రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడితే ఛాతినొప్పి, మెట్లు ఎక్కేటప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నడిచేటప్పుడు మోకాళ్ల నొప్పులు వస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువయ్యినప్పుడే   గుండెపోటు, స్ట్రోక్ వంటి రోగాలు వస్తాయి. 

29

నిజానికి చెడు కొలెస్ట్రాల్ ను రెడ్ మీట్ బాగా పెంచుతుంది. అందుకే దీన్ని తగ్గించడానికి ఎర్ర మాంసం వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే కొవ్వులు, స్వీట్లు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారాలను మొత్తమే తినకపోవడమే, లేకపోతే చాలా వరకు తగ్గించడమో చేయాలి.  ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తినాలి.  చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

39

సోయా మిల్క్

సోయా మిల్క్ కొలెస్ట్రాల్ ను  తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజూ సోయా మిల్క్ ను మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు 6% వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రమం తప్పకుండా సోయా పాలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 

49
berries

బెర్రీలు

బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. బెర్రీలను రోజూ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీలను రోజూ తింటే శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

59
tea

గ్రీన్ టీ

గ్రీన్ టీలో కెఫిన్ కంటెంట్ ఉండదు. కాఫీ, టీ లతో పోల్చితే గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే బరువును తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు  కొలెస్ట్రాల్ ను చాలా వరకు తగ్గిస్తాయి. 
 

69

సిట్రస్ పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లన్నీ రక్తంలో ఎక్కువగా ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిలో ఉండే పెక్టిన్ ఫైబర్, లిమోనాయిడ్ సమ్మేళనాలు రక్త నాళాలు దగ్గరగా రాకుండా నిరోధిస్తాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. సిట్రస్ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెపోటు,  స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
 

79

ఓట్ మిల్క్

ఓట్ మిల్క్ లో ఫైబర్ కంటెంట్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వోట్మీల్ నుంచి తయారైన వోట్ మిల్క్ లో బీటా-గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను  తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి ఓట్ మిల్క్ ను డైట్ లో  తప్పకుండా చేర్చుకోండి. 
 

89
Image: Getty Images

తృణధాన్యాలు

తృణధాన్యాలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. వీటిని తింటే ఎన్నో జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఇవి బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి సహాయపడతాయి.
 

99

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇవి వెయిట్ ను తగ్గించడంతో పాటుగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, బాదం, గింజలు వంటి ఆహారాలు ఎల్డిఎల్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories