మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలి.. అసలు పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా?

Navya G   | Asianet News
Published : Jan 23, 2022, 03:25 PM IST

మనిషి జీవితంలో (Life) అనేక ప్రశ్నలు మెదులుతూంటాయి. ఈ ప్రశ్నలకు లభించే జవాబు ఎందరికో జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఆలోచిస్తారు. మనసులో మెదిలే ప్రశ్న చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు. కానీ మనసులో మెదిలే ఆ ప్రశ్నకు ఖచ్చితమైన జవాబు కోసం అన్వేషిస్తారు. ఇలా ప్రతి ఒక్కరి మనసులోని అనేక ప్రశ్నలకు వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాల్లో సరైన జవాబు దొరుకుతుంది. మరి ఇప్పుడు మనం మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలో పురాణాలు (Myths) ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం..

PREV
16
మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలి.. అసలు పురాణాలు ఏం చెబుతున్నాయో తెలుసా?

భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం (Death) అనేది తప్పదు. అయితే మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయాలని చాలా మందిలో ప్రశ్నలు మొదలవుతాయి. వీటికి సరైన సమాధానం స్వయంభువులైన దేవతలు, జ్ఞానసంపద కలిగిన మహానుభావులు, తపశ్శక్తి సంపన్నులైన ఋషులు, మునులు, సర్వసంగ పరిత్యాగులు, సకల విషయాలూ తెలిసిన పండితులు పురాణాల ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి అవి తిరుగులేనివి నమ్మదగినవిగా (Reliable) ఉంటాయి.
 

26

భాగవతంలో శుక మహర్షిని (Shuka Maharshi) పరీక్షిత్తు మరణం ఆసన్నమైనప్పుడు పురుషులు వినదగినది ఏది అని ప్రశ్నించాడు. పరీక్షిత్తుకు (Parikshittu) మరణం వచ్చే సమయం నిర్ణయమైపోయింది. పరీక్షిత్తుకు మరణం దగ్గరగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యగా ఏడురోజుల్లో భాగవతం వినాలనే విషయం తెలుసు. ఆయన ఆ పని మీదనే ఉన్నాడు కూడా.
 

36

అయితే మరి ఆయన ఆ ప్రశ్న అడగడంలో ఆంతర్యం ఏమిటి? మరి ఈ ప్రశ్న వెనుక ఉద్దేశం (Intent) ఏమిటంటే ప్రతి మనిషికి మరణం తప్పదు అని లోకానికి తెలియజేయడమే. పరీక్షిత్తు మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రశ్నకు శుక మహర్షి ఖచ్చితంగా నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు. మనిషి మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు భయాన్ని (Fear), అన్ని విషయాల పట్ల మమకారాన్ని తెంచుకోవాలి.
 

46

మనసులో ఎలాంటి ఆలోచనలు (Ideas) వచ్చినా చెదరని మనసు కలిగి ఉండాలి. మనసులో బ్రహ్మ ప్రతిపాదితమైన ఓంకార (Omkara) నామాన్ని జపిస్తూండాలి. ప్రాణాయామంతో మనసును నిమగ్నం చేసుకొని భగవంతుని స్మరించుకోవాలని శుకమహర్షి బోధించాడు. అలాగే మరణం సమీపించినప్పుడు కొన్ని జాగ్రత్తలు గురించి శుకమహర్షి బోధించాడు.
 

56

ఇంద్రియాలు (Senses), బుద్ధి, మనోమయ వ్యవహారాలు, ఆలోచనలు, జీవన గమన రీతులు ఇలాంటివన్నీ ఒక పూర్ణ రూపంపై నిలిచి సదా దాన్నే జపించడం చేయాలి. మనసులో ఎటువంటి ఆలోచనలు, చింతలను చేయరాదు. అలా జరగాలంటే మనస్సుకు సాధన (Practice) తప్పనిసరి. ఆ సాధన ఏ ఒక్క నిమిషము ఒక్క రోజు లేదా ఒక కోణంలో చేస్తే చాలదు.
 

66

సాధన నిరంతరాయమైన ప్రక్రియగా ఉండాలి. అలా ఉంటే అది బ్రహ్మానంద స్థితి. ఈ స్థితిలో ఉన్న వారికి ఇతర విషయాల పట్ల ఆసక్తి (Interest) ఉండదు. వీటన్నింటి ఆంతర్యం (Intimacy) సదా భగవధ్యానం చేస్తూండమని శుకమహర్షి బోధించాడు.

click me!

Recommended Stories