వీటిని తగ్గిస్తే చాలు.. కడుపు ఉబ్బరం ఆటోమెటిక్ గా తగ్గుతుంది..

First Published Aug 28, 2022, 4:58 PM IST

కొంతమందికి ఈ సమయం.. ఆ సమయం అంటూ లేకుండా ఎప్పుడూ కడుపు ఉబ్బరంగానే ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను తగ్గిస్తే వెంటనే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

కడుపులో ఏర్పడే ఒకరకమైన సమస్యే కడుపు ఉబ్బరం. ఇది జీర్ణవ్యవస్థకు ఆటంకం కలగడం వల్ల ఏర్పడుతుంది. ఇక ఈ సమస్యను ఫేస్ చేసే వారి కడుపు ఎఫ్పుడూ నిండుగానే అనిపిస్తుంది. దీనివల్ల వీరు ఆహారాలను తినడానికి వెనకాడుతారు. ఈ సమస్య కుదురుగా ఉండనీయదు. అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా అయితే మాత్రం వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేంటో చూసేద్దాం పదండి. 

fiber

ఫైబర్ ఫుడ్స్

ఫైబర్ ను తీసుకోవడం ఆకలి కోరికలు తగ్గుతాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కగా ఉపయోగపడుతుంది. కానీ శరీరంలో ఫైబర్ నిల్వలు ఎక్కువైనా సమస్యే. ఎందుకంటే ఇది కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అందుకే ఫైబర్ ఫుడ్స్ ను పరిమితిలోనే తీసుకోండి. మీరు తినే ఆహారాల్లో ఫైబర్స్ ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడండి. 
 

షుగర్ ఆల్కహాల్ 

షుగర్ ఆల్కహాల్ కూడా కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది. అందుకే వీటిని తాగడం తగ్గించండి. ముఖ్యంగా శీతల పానీయాలు, క్యాండీలు, చూయింగ్ గమ్ లను తీసుకోవడం చాలా తగ్గించండి. అవసరమైతే మొత్తమే మానుకోండి. ఒక వేళ మీరు వీటిని తింటే కడుపులో వాయువు ఉత్పత్తి అయ్యి కడుపు ఉబ్బుతుంది. 
 

సోడాలు

కడుపు ఉబ్బరానికి సోడాలు కూడా కారణమే. ఎందుకంటే సోడాలను తాగడం వల్ల కడుపులో గ్యాస్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండండి. 
 

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తాయి.  కొన్ని అధ్యయనాల ప్రకారం.. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ప్రోబయోటిక్స్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. 

click me!