మైగ్రేన్ నొప్పి భరించలేనిది. దీనికి ఎన్ని మెడిసిన్స్ ను తీసుకున్నా.. పూర్తిగా తగ్గనే తగ్గదు. ఈ సమస్య మరీ ఎక్కువ అయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే ఈ నొప్పిని తాత్కాలికంగా తగ్గించేందుకు కొన్ని చిట్కాలు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అవేంటంటే..
ఓ సర్వే ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో ప్రతి ఏడుగురిలో ఒకరు ఈ మైగ్రేన్ సమస్యను ఫేస్ చేస్తున్నారట. మైగ్రేన్ వల్ల తలలో ఒకసైడు మాత్రమే నొప్పి వస్తుంది. ఈ తలనొప్పి దారుణంగా ఉంటుంది. ఈ నొప్పిని భరించడం చాలా కష్టం. అందుకోసమే ఈ సమస్య మరీ ఎక్కువైనప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మైగ్రేన్ నొప్పి నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
26
వాటర్
శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే కూడా కొందరికీ మైగ్రేన్ నొప్పి వస్తుంది. అందుకే ఇలాంటి వారు రోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. ఈ నొప్పి వచ్చినప్పుడు నీళ్లను ఎక్కువ గా తాగండి. కొద్దిసేపటికి నొప్పి తగ్గుముఖం పడుతుంది.
36
మసాజ్
మసాజ్ వల్ల తో తలనొప్పి, మైగ్రేన్ నొప్పి, ఒత్తిడి వంటి సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. ఇందుకోసం భుజాలు, మెడ కండరాలను నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఉండాలి. ఇది మీ శరీరాన్ని రిలాక్స్ చేయడంతో పాటుగా నొప్పిని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.
46
migraine
ఆహారాలు
మైగ్రేన్ నొప్పి అంత తొందరగా తగ్గదు. ఈ నొప్పి తో బాధపడుతున్నప్పుడు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, నిల్వ పచ్చడి ఫుడ్స్ ను తినకండి. ఎందుకంటే ఈ ఆహారాలను అంత సులువుగా జీర్ణం కావు. అందుకే ఇలాంటి సమయంలో తేలిగ్గా అరిగే ఆహారాలనే తినండి. లేదంటే నొప్పి మరింత ఎక్కువ అవుతుంది.
56
యోగా
ధ్యానం ఎన్నో సమస్యను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం శ్వాస వ్యాయామాలను చేయండి. అలాగే శరీరాన్ని కదిల్చే భంగిమలను కూడా చేయండి. ఇవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా మైగ్రేన్ నొప్పిని కూడా తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
66
లావెంటర్ ఆయిల్
మైగ్రేన్ నొప్పిని తగ్గించేందుకు లావెంటర్ నూనె సహాయపడుతుంది. ఇందుకోసం ఈ నూనె స్మెల్ చూడాలి. ఇది నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.