పసుపు పాలు వీళ్లు అస్సలు తాగనేకూడదు..

Published : Aug 28, 2022, 03:41 PM IST

పసుపు పాలు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో పాటుగా..దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పని చేస్తాయి. అయితే ఈ పాలను కొందరు పొరపాటున కూడా తాగకూడదు.   

PREV
16
పసుపు పాలు వీళ్లు అస్సలు తాగనేకూడదు..

పసుపులో ఎన్నో దివ్య ఔషదగుణాలుంటాయి. అందుకే దీనిని నేటికీ ఆయుర్వేదంలో ఉపయోగిస్తూనే ఉన్నారు. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇక పాలలో కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలుంటాయి. గ్లాస్ పాలలో కొద్దిగా పసుపును కలుపుకుని తాగితే శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తాగడం వల్ల ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు తగ్గడంతో పాటుగా ఎముకలు కూడా బలపడుతాయి. ఎందుకంటే పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అయితే పసుపు పాలు మంచివే అయినా.. వీటిని కొంతమంది అస్సలు తాగకూడదు. ఈ పాలను ఎవరెవరు తాగకూడదో తెలుసుకుందాం..

26

హైపోగ్లైసీమియా

బ్లడ్ షుగర్ లెవెల్స్ మరీ తక్కువగా ఉండటాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఈ సమస్యతో బాధపడేవారు పసుపు పాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే పసుపులో ఉండే కర్కుమిన్ వీరి రక్తంలో చక్కెర స్థాయిలను మరింత తగ్గిస్తుంది. అందుకే  రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే వారు పసుపు పాలను తాగకూడదు. 
 

36

అజీర్థి

ఈ మధ్యకాలంలో చాలా మంది అజీర్థి సమస్యను ఫేస్ చేస్తున్నారు. వీళ్లు కూడా పసుపు పాలను తాగకూడదు. అలాగే  కడుపులో మంట సమస్య, మలబద్దకం సమస్య, కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ , గుండెలో మంట, యాసిడ్ రిఫ్లక్స్  వంటి  ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా పసుపు పాలు మంచివి కావు. వీళ్లు ఒకవేళ పసుపు పాలను తాగితే ఈ సమస్యలు మరింత పెరిగిపోతాయి. 

46

రక్తహీనత

రక్తహీనత సమస్య  ఎక్కువగా ఆడవారికే వస్తుంది. ఐరన్ లోపం వల్ల ఈ సమస్య బారిన పడతారు. అయితే ఈ రక్తహీనత సమస్యతో బాధపడేవారు కూడా పసుపు పాలను తాగకూడదు. ఈ పాలు ఈ సమస్యను పెంచుతాయి. 

56

కిడ్నీ సమస్యలు

ఎవరైతే కిడ్నీలకు సంబంధించిన ఏవైనా సమస్యలతో బాధపడుతున్నారో వారు కూడా పసుపు పాలకు దూరంగా ఉండాలి.  ఎందుకంటే ఇవి కిడ్నీలను మరింత ప్రమాదంలో పడేస్తాయి. ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లున్న వారు పసుపు పాలనుు అసలే తాగకూడదు. ఒకవేళ తాగితే.. రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి. 

66

పసుపు పాలు ఎన్ని తాగాలి

పసుపు పాలను తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే ఎముకలు బలంగా తయారవుతాయి. అంతేకాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కానీ ఈ పాలను తాగితే శరీరంలో వేడి పెరుగుతుంది. అయితే ప్రతిరోజూ గ్లాస్ పాలలో చిటికెడే పసుపును కలుపుకుని తాగాలి. దీనిలో కొంచెం పంచదారను కూడా మిక్స్ చేయొచ్చు.

    

  

click me!

Recommended Stories