పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంతో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో వారు అడిగినప్పుడల్లా క్రీమ్ బిస్కెట్లు కొని ఇస్తూ ఉంటారు. కానీ వైద్యులు చెబుతున్న ప్రకారం క్రీమ్ బిస్కెట్లు పిల్లల ఆరోగ్యానికి ఎంతో హానికరం. అదెలాగో తెలుసుకోండి.
సాధారణ బిస్కెట్ల కంటే క్రీమ్ బిస్కెట్లను పిల్లలు ఇష్టపడతారు. లోపల ఉండే క్రీమ్ అంటే వారికి చాలా ఇష్టం. అది ఎంతో తియ్యగా ఉంటుంది. పిల్లలు మారాం చేస్తే తల్లిదండ్రులు కొనిస్తారు. కానీ అలా కొనివ్వడం పిల్లల ఆరోగ్యాన్ని పాడుచేయడమేనని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. బిస్కెట్లే ఆరోగ్యకరమైనవి కావు. అందులో క్రీమ్ బిస్కెట్లు మరింత హానికరం. క్రీమ్ బిస్కెట్లు ఎందుకు తినకూడదో తెలుసుకోండి.
26
క్రీమ్ వల్లే నష్టం
తీపిగా ఉండే క్రీమ్ బిస్కెట్లలో చెడు కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ బిస్కెట్లలో ఉండే క్రీమ్ లో ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. ఇది పిల్లలకే కాదు ఎవరికీ మంచిది కాదు. కూరగాయల వ్యర్థాల నుండి తీసిన కొవ్వును బిస్కెట్ల మధ్య క్రీమ్ అని పెడతారు. తీపి కోసం చక్కెర సిరప్, రంగు కోసం కృత్రిమ రంగులు, రుచి కోసం రసాయనాలు కలిపి క్రీమ్ బిస్కెట్ తయారు చేస్తారు. ఇవి చెడిపోకుండా ఉండటానికి ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతారు.
36
చెడు కొవ్వు పెరిగిపోతుంది
క్రీమ్ లో ఉండే కూరగాయల కొవ్వు ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది శరీరంలో చెడు కొవ్వును పెంచుతుంది. ఈ బిస్కెట్లు అధికంగా తింటే గుండెపోటు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు వీటిని తింటే బరువు త్వరగా పెరుగుతారు. చిన్న వయస్సులోనే డయాబెటిస్ రావడానికి కూడా క్రీమ్ బిస్కెట్లు కారణం కావచ్చు.
క్రీమ్ బిస్కెట్లలోని ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కడుపు, నడుము చుట్టూ కొవ్వు పేరుకుపోయి కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి కూడా దెబ్బతింటాయి.
56
పిల్లల ప్రవర్తనా మారుతుంది
ఈ బిస్కెట్లను ఆకర్షణీయంగా మార్చడానికి కళ్ళు చెదిరే రంగుల్లో క్రీమ్‌లు వేస్తారు. ఈ రంగుల కోసం కలిపే కొన్ని రసాయనాలు పిల్లల నాడీ వ్యవస్థను దెబ్బతీసే అవకాశం ఉంది. దీనివల్ల పిల్లలు హైపర్ యాక్టివ్‌గా, చిరాకుగా మారతారు. ADHD, అలెర్జీలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు రావొచ్చు.
66
ఆకలి పెరుగిపోతుంది
ఈ బిస్కెట్లలో ఉండే చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. దీనివల్ల ఆకలి ఎక్కువగా అవుతుంది. బరువు పెరగడం, డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. పిల్లలకు చిన్న వయస్సులోనే కొవ్వు కాలేయ వ్యాధి రావొచ్చు. ఇంట్లోనే బెల్లం వేసి, చిరుధాన్యాలతో బిస్కెట్లు చేసివ్వవచ్చు.