అరటి లేదా ఆపిల్.. ఏ పండు ఎక్కువ మంచిది? ఈ రెండింటిలో మధుమేహులు దేన్ని తినాలి?

Published : Nov 10, 2022, 04:14 PM IST

అరటి, ఆపిల్ పండ్లు రెండూ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవే.. కానీ వీటిలో ఒకదానిలో ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.  అదేంటంటే..  

PREV
14
అరటి లేదా ఆపిల్.. ఏ పండు ఎక్కువ మంచిది? ఈ రెండింటిలో మధుమేహులు దేన్ని తినాలి?

మనం ఫిట్ గా, ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మొదట చేయాల్సిన అసలు పని పండ్లను పుష్కలంగా తినడం. అందులో ఆపిల్ పండు చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే రోజూ ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు ఆరోగ్య నిపుణులు. అందుకే రోజూ మర్చిపోకుండా ఒక ఆపిల్ ను తినడం మంచిది. దీనితో పాటుగా చాలా మంది ఎక్కువగా తినే పండ్లలో అరటి ఒకటి. అరటి కాలాలతో సంబంధం లేకుండా అందుబాటులో ఉంటుంది. దీన్ని తినడం వల్ల బరువు తగ్గడం నుంచి గుండె  ఆరోగ్యం వరకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే దీన్ని స్మూతీ అంటూ వివిధ రూపాల్లో తీసుకుంటుంటారు. అసలు ఈ రెండు పండ్లలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం... 

24

ఆపిల్

ఆపిల్ పండ్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ మీ గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. తొందరగా ఆకలి కానీయదు. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఇంకేముంది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. ఫిట్ గా కూడా ఉంటారు.   ఆపిల్స్ లో  విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి సహాయపడతాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఆటోమెటిక్ గా తగ్గుతాయి. 
 

34
banana

అరటి

అరటిపండు కూడా ఫైబర్ కంటెంట్ కు మంచి వనరు. అరటిలో ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది పేగులకు మేలు చేసే బ్యాక్టీరియాలను ప్రోత్సహిస్తుంది. ఈ బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. అరటిపండ్లను తినడం వల్ల మీకు ఎక్కువ సేపు ఆకలి కాదు. ఈ పండు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అరటిలో పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే బరువు తగ్గేందుకు సహాయపడతాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

44

అరటి, ఆపిల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆపిల్స్ లో అరటిపండ్ల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారి ఆపిల్ మంచిది. ఇది కాకుండా డయాబెటీస్ పేషెంట్లు అరటిపండ్లకు బదులుగా ఆపిల్ పండ్లనే తినాలని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకునే వారికి ఆపిల్ పండ్లకంటే అరటిపండ్లను తింటేనే మంచిది. ఎందుకంటే అరటి మీరు ఆరోగ్యంగా బరువు పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో ప్రోటీన్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. 
  

Read more Photos on
click me!

Recommended Stories