Anant Ambani: కామాఖ్య ఆలయంలో అనంత్ అంబానీ సంప్రదాయ పద్దతిలో పూజలు చేశారు. అక్కడ పావురాలను ఎగరేయడం, మేకలను ఆలయానికి వదిలేశారు. ఇది అక్కడ కొనసాగుతున్న ఒక సంప్రదాయం. అసలు ఆలయంలో ఈ ఆచారం ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా?
ఆసియాలోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ. అంబానీ కుటుంబానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువ. అనంత్ అంబానీ మంగళవారం అస్సాంలోని గువాహటిలో ఉన్న కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక సంప్రదాయం ఆ ఆలయంలో ప్రకారం పావురాలను ఎగరేశారు. అలాగే మేకలను కూడా ఆలయ ప్రాంగణంలో విడిచిపెట్టారు. ఆ ఆలయ సందర్శనకు వెళ్లిన వారు ఇలా పావురాలను, మేకలను వదలడం ప్రత్యేక ఆచారం ఇప్పుడు.
24
కామాఖ్య ఆలయ విశిష్ఠత
కామాఖ్య ఆలయం మనదేశంలోని శక్తిపీఠాలలో ఒకటి. దీన్ని తాంత్రిక పూజలకు ప్రధాన కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారిని యోని రూపంలో పూజిస్తారు. దీన్ని విశ్వం జననానికి మూలంగా చెప్పుకుంటారు. కామాఖ్య దేవిని జగన్మాతగా భక్తులు నమ్ముతారు. ఇక్కడ శాస్త్రీయ పూజా విధానాలతో పాటు, స్థానికంగా ఉండే గిరిజన నమ్మకాలను కూడా పాటిస్తారు. ఈ ఆచారాలలో పావురాలను ఎగరేయడం, మేకలను వదిలివేయడం కూడా ఉన్నాయి.
34
పావురాలు, మేకలే ఎందుకు?
కామాఖ్య ఆలయంలో భక్తులు మొక్కు తీర్చుకోవడానికి పావురాలను, మేకలను రెండింటినీ సమర్పిస్తారు. ఈ రెండు జీవులను అమ్మవారికి అర్పించడాన్ని 'జీవ సమర్పణ' అంటారు. ఈ త్యాగంలో ఎలాంటి రక్తపాతం, నొప్పి లేదా హింస ఉండదు. వాటిని బలి ఇవ్వరు. కేవలం ఆలయ ప్రాంగణంలో వదిలివేస్తారు.
స్థానికంగా చెప్పే కథల ప్రకారం దంపతులు సంతానం కోసం కామాఖ్య అమ్మవారిని మొక్కుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత, వారు పావురాన్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కానీ అక్కడున్న పావురాలన్నీ అరవడం మొదలుపెట్టడంతో, ఆ దంపతులు బలికి బదులుగా పావురాన్ని ఎగరేశారు. అప్పటి నుంచి అమ్మవారికి పావురాలను స్వేచ్ఛగా వదిలే పద్ధతి వచ్చింది.
హిందూ ధార్మిక సంప్రదాయాలలో పావురాలకు కామదేవుడితో అనుబంధం ఉంది. హిందూ పురాణాల ప్రకారం, ప్రేమ, కామానికి అధిపతి కామదేవుడు. అతని భార్య రతీదేవికి పావురాలంటే చాలా ఇష్టం. ప్రాచీన కాలంలోప్రేమలేఖలను చేరవేయడానికి పావురాలను ఉపయోగించేవారు. ప్రాచీన గ్రీకు, రోమన్ పురాణాలలో కూడా ప్రేమ దేవత అయిన వీనస్‌కు తెల్ల పావురాలతో సంబంధం ఉంది.