Fathers Day Gifts: ఫాదర్స్ డే రోజు మీ నాన్నకు స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం కొంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? ఏవేవో కొనడం కంటే రోజూ వాడే ట్రిమ్మర్ లేదా షేవర్ కిట్ ఇవ్వొచ్చు. రూ.2000 లోపే దొరికేస్తాయి.
ఫాదర్స్ డేకు మీ నాన్నకు ఏం గిఫ్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? డ్రెస్సెస్, షూస్, వాచ్..ఇలాంటివి కాకుండా కొత్తగా ట్రై చేయండి. ఈ రోజుల్లో చాలామంది ఎలక్ట్రిక్, యూఎస్‌బీ రీఛార్జబుల్ ట్రిమ్మర్లనే ఇష్టపడుతున్నారు. వీటిని వాడటం చాలా సులభం. ఇవి పోర్టబుల్‌గా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు, ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. వీటితో షేవింగ్, ట్రిమ్మింగ్ వేగంగా, సులభంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ప్రొఫెషనల్ గ్రూమింగ్ లుక్ పొందొచ్చు.
26
మినీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ షేవర్
మీరు మీ నాన్న కోసం పాకెట్-సైజ్, ట్రావెల్-ఫ్రెండ్లీ షేవర్ కోసం చూస్తుంటే, ఈ మినీ పోర్టబుల్ ఎలక్ట్రిక్ షేవర్ మంచి ఆప్షన్. ఇందులో 300mAh లిథియం బ్యాటరీ ఉంటుంది. గంటసేపు ఛార్జ్ చేస్తే 8 నుంచి 10 సార్లు వాడుకోవచ్చు. దీని చిన్న సైజు వల్ల ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి చాలా బాగుంటుంది. అమెజాన్ సేల్‌లో దీని ధర సుమారు రూ.350 వరకు ఉండొచ్చు.
36
మ్యాగ్నెటిక్ షేవింగ్ హెడ్ ట్రిమ్మర్
మ్యాగ్నెటిక్ షేవింగ్ హెడ్ ఉన్న ట్రిమ్మర్లలో మ్యాగ్నెటిక్ బ్లేడ్లు ఉంటాయి. ఇవి కచ్చితమైన, స్మూత్ ట్రిమ్మింగ్‌కు సహాయపడతాయి. ఇలాంటి ట్రిమ్మర్లలో ఎక్కువ బ్యాటరీ లైఫ్, LED డిస్‌ప్లే, వాటర్‌ప్రూఫ్ బాడీ, USB టైప్-సి ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీని మోడ్రన్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల వల్ల చాలామంది దీన్ని ఇష్టపడతారు. దీని ధర సుమారు రూ.1,899 వరకు ఉండొచ్చు.
ఫాదర్స్ డే గిఫ్ట్ కోసం పోర్టబుల్ ఎలక్ట్రిక్ ఫేస్ షేవర్ కూడా ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో రెసిప్రొకేటింగ్ బ్లేడ్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల షేవింగ్ చేసేటప్పుడు చర్మం కట్ అయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది ముఖంపై ఉన్న వెంట్రుకలను సులభంగా ట్రిమ్, షేవ్ చేయడానికి సహాయపడుతుంది. దీని ధర సుమారు రూ.1,879 ఉంటుంది.
56
డిజిటల్ డిస్‌ప్లే షేవింగ్ ట్రిమ్మర్
మీ నాన్నకు ఈ డిజిటల్ డిస్‌ప్లే ఉన్న షేవింగ్ ట్రిమ్మర్ కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో మూడు రౌండ్ మ్యాగ్నెటిక్ బ్లేడ్లు, బ్యాటరీ స్టేటస్ చూపించే డిజిటల్ డిస్‌ప్లే, ట్రావెల్ లాక్ ఫీచర్ ఉంటాయి. ట్రావెల్ లాక్ ఫీచర్‌తో ప్రయాణాల్లో దీన్ని సేఫ్‌గా తీసుకెళ్లొచ్చు. దీని స్టైలిష్ డిజైన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు దీన్ని ఒక ప్రీమియం గిఫ్ట్‌గా మారుస్తాయి. దీని ధర సుమారు రూ.1,500 వరకు ఉండొచ్చు.
66
మల్టీ-గ్రూమింగ్ ట్రిమ్మర్ కిట్
గడ్డం, మీసాలు, ముక్కు, చెవుల్లోని వెంట్రుకల గ్రూమింగ్ కోసం ఒకే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ఈ మల్టీ-గ్రూమింగ్ ట్రిమ్మర్ కిట్ బెస్ట్ ఆప్షన్. ఇందులో చాలా అటాచ్‌మెంట్లు ఉంటాయి. వీటితో వేర్వేరు అవసరాలకు తగ్గట్టుగా గ్రూమింగ్ చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ రోజూవారీ ఉపయోగం కోసం చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.