ఈ చలికాలపు పండ్లను తింటే కిలోల్లో బరువు తగ్గుతారు తెలుసా?

First Published Dec 2, 2022, 10:54 AM IST

బరువు తగ్గడం చాలా చాలా కష్టమని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రయత్నిస్తే.. సాధించలేనిది ఏదీ లేదు. కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఓవర్ వెయిట్ నుంచి సులువుగా బయటపడొచ్చు తెలుసా..? 
 

చలికాలపు చల్లని గాలులు మనల్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. దగ్గు, జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. వీటివల్ల కొందరు వ్యాయామానికి గుడ్ బాయ్ చెప్తే.. ఇంకొందరు చల్లచలికి ఎవరు లేస్తారని వ్యాయామాన్ని చేయడం మానేస్తుంటారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు చలికాలంలో పండే కొన్ని పండ్లు బరువు తగ్గేందుకు సహాయపడతాయి. అవేంటంటే.. 

ద్రాక్షపండ్లు

నిజానికి ద్రాక్షలను తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే ఈ పండ్లను తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉందన్న అనుభూతి కలుగుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. చలికాలంలో మీరు తొందరగా బరువు తగ్గేందుకు ఈ పండు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

దానిమ్మ

దానిమ్మ పండులో పాలిఫెనాల్ అనే యాంటీ  ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీవక్రియకు సహాయపడుతుంది. దీంతో మీ శరీరంలో హానికరమైన ట్యాక్సిన్స్ ఏర్పడే అవకాశమే ఉండదు. దీనివల్ల మీరు సులువుగా బరువు తగ్గుతారు.

guava

జామ

జామకాయల్లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు అతిగా తినలేరు. ఈ పండులో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ పండు మీరు వేగంగా బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడుతుంది. 

అరటి

అరటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉందన్న అనుభూతి కలుగుతుంది. మొత్తంగా ఈ పండు మీరు కిలోల్లో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 

నారింజ పండ్లు

నారింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది. దీనిలో పొటాషియం, ఫైబర్, ముఖ్యమైన ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండు మీరు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. 
 

అత్తిపండు

అత్తిపండ్లలో ఫైబర్ తో పాటుగా పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పండు మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైసిన్ అనే ఎంజైమ్ మీ జీర్ణక్రియ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఈ పండ్లు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా సహాయపడతాయి. 
 

Pineapple

అనాస పండు

అనాసలో పోషకాలు మెండుగా ఉంటాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. పైనాపిల్ లో బ్రోమెలైన్ కూడా ఉంటుంది. ఇది జీవక్రియకు సహాయపడుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ చాలా వరకు తగ్గుతుంది. 

apples

ఆపిల్స్

ఆపిల్స్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.ఇవి మీకు అంత తొందరగా ఆకలి కానీయవు. అంతేకాదు మోతాదులో తినేందుకు సహాయపడతాయి. ఆపిల్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. 
 

click me!