హ్యాపీ హార్మోన్స్ ను పెంచే అమేజింగ్ మూలికలు

Published : Aug 08, 2022, 04:09 PM IST

భారతదేశంలో పురాతన వైద్యంలో మూలికలకు చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ అవి మానవ శరీరంలో హ్యాపీ హార్మోన్లను కూడా పెంచుతాయన్న సంగతి మీకు తెలుసా..  

PREV
17
 హ్యాపీ హార్మోన్స్ ను  పెంచే అమేజింగ్ మూలికలు
herbs

మూలికలను, సుగంధ ద్రవ్యాలను వివిధ ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటాం.. నిజానికి ఇవి వంటకు రుచిని తేవడమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. పురాతన కాలం నుంచి వివిధ ఐషదాల్లో వీటిని ఉపయోగిస్తున్నారు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా.. నిద్రకు సహాయపడతాయి. అంతేకాదు వీటిలో ఉండే ఔషదగుణాలు సెరోటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లను పెంచడానికి సహాయపడతాయి. 

27

మెంతులు:  ప్రతి వంటగదిలో మెంతులు ఖచ్చితంగా ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. వీటిలో చలువ చేసే గుణం ఉంటుంది.  జీవక్రియ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. శరీర వేడి ఎక్కువగా ఉండేవారు మెంతులను తింటే ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇవి ఒత్తిడిని తగ్గించి సంతోషకరమైన హార్మోన్ల విడుదలకు సహాయపడుతాయి. 
 

37

చమోమిలే: చమోమిలే లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి నిద్ర.. మేల్కొలుపు చక్రాలను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. దీని శోథ నిరోధక చర్యతో పాటు ఒత్తిడి-ఉపశమన లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే చమోమిలే టీని ఇష్టపడనివారుండరు.
 

47

తులసి: పవిత్రమైన తులసి ఆకుల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మెదడును కూల్ చేసే లక్షణాలను సైతం కలిగి ఉంటుంది. అలాగే ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మానసిక స్థితిని పెంపొందించడంలో తులసి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన సమస్యతో బాధపడేవారు ఉదయాన్నే కప్పు తులసి టీని తాగితే ఉపశమనం పొందుతారు. తులసి టీ తాగడం వల్ల మీ శక్తి స్థాయిలు మెరుగుపడతాయి. మీరు ఖాళీ కడుపుతో తేనెతో  కొన్ని తులసి ఆకులను నమిలితే ఆరోగ్యానికి చాలా మంచిది. 

57

త్రిఫల: హ్యాపీ హార్మోన్ సెరోటోనిన్ ఎక్కువగా గట్ లో ఉత్పత్తి అవుతుంది. త్రిఫల మలబద్ధకం, మూత్రంతో పాటాగా ఇతర జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇది మీ గట్ ను ఆరోగ్యంగా చేస్తుంది. మానసిక స్థితిని కూడా  పెంచుతుంది.

67

అశ్వగంధ: అశ్వగంధను తీసుకోవడం మైండ్ రీఫ్రెష్ గా మారుతుంది. అశ్వగంధతో మానసిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇందుకోసం మీరు 1/4 టీస్పూన్ల అశ్వగంధ పొడిని నీటిలో కలిపి పడుకునే ముందు తాగండి. ఇది మీ ఒత్తిడిని తగ్గించి.. హాయిగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. 
 

77

దాల్చినచెక్క:  కమ్మని సువాసనొచ్చే దాల్చిన చెక్క శరీరంలో వేడిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది వాత, కఫం సమస్యలను తొలగిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ని కూడా పెంచుతుంది. మీ ఉదయం పూట మీరు తాగే పానీయాల్లో చిటికెడు దాల్చినచెక్కను కలుపుని తాగండి. ఆరోగ్యం బాగుంటుంది.

 

Read more Photos on
click me!

Recommended Stories